ఎంపీ మగాడిగా నిరూపించుకోవాలట | should get married and prove his masculinity

Should get married and prove his masculinity

Azam Khan, Yogi Adityanath, masculinity, ఆజం ఖాన్, యోగిరాదిత్య, బిజెపి, యోగి ఆదిత్యనాధ్

Terming sages in India as a “frustrated” lot, Uttar Pradesh Minister Azam Khan courted a fresh controversy as he advised BJP MP Yogi Adityanath to get married and “prove his masculinity” with the latter seeking his expulsion. “Yogi Adityanath should first get married and prove his masculinity,” Khan told reporters on the sidelines of an event here last night.

ఎంపీ మగాడిగా నిరూపించుకోవాలట

Posted: 05/05/2016 11:32 AM IST
Should get married and prove his masculinity

దేశంలొ రాజకీయాలు మరీ దారుణంగా మారాయి. ఇది తరుచుగా మనం వింటున్న మాటలు. కొన్ని సంఘటలను వింటే అవునన అనిపిస్తోంది. కొంత మంది నాయకులు చేసే నోటిదురుసు వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. తాజాగా బిజెపి ఎంపీ యోగి ఆదిత్యనాథ్ పై సమాజ్-వాది పార్టీ మంత్రి, ఎప్పుడూ ఏదో ఒక విధమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసే నేత అజాంఖాన్ మరోసారి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆధిత్యనాథ్ ఇతరులపై విమర్శలు చేయడం మానుకుని ముందు పెళ్లి చేసుకోవాలని, తాను మగాడినని నిరూపించుకోవాలని, తండ్రిగా మారాలని అన్నారు. అలా చేయడం వల్ల అతడి వంశం పెరుగుతుందని చెప్పారు. '

‘అతడు (ఆధిత్య నాథ్) తప్పకుండా ఎవరినో ఒకర్ని పెళ్లి చేసుకోవాలి. అది అతడి వంశాన్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది' అని ఆజం ఖాన్ అన్నారు. తలాక్ వ్యవస్థను తప్పుబడుతూ మరో బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ చేసిన వ్యాఖ్యలపై కూడా ఆజం ఖాన్ ఘాటుగా స్పందించారు. ఒక అమ్మాయిని రేప్ చేసిన వ్యక్తా ఇలాంటి విషయాల గురించి మాట్లాడేది అని అన్నారు. అయినా రేపిస్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అలాంటి మనిషి గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలూ చేయబోనని చెప్పారు. అలాగే, బాలీవుడ్ నటుడు గోవిందాపై యూపీ గవర్నర్ రామ్ నాయక్ చేసిన వ్యాఖ్యల విషయంలో స్పందన కోరగా ఆయనను రామ్ నాయక్ అనొద్దని రామ్ నాయక్ గారు అనాలని, ఆయన ఓ రాష్ట్రానికి గవర్నర్ అని మర్చిపోతే ఎలా అని మీడియాకు ఆజం ఖాన్ హితవు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles