This is breakup time for TDP and BJP

This is breakup time for tdp and bjp

Modi, Govt, AP, Special Status, BJP,. TDP, టిడిపి, మోదీ, బిజెపి, ఏపి, ప్రత్యేక హోదా

Modi govt clear on Special Status for AP. After that TDP leaders opposing BJP bahaviour with TDP. BJP assured for special status in elections.

టీడీపి, బిజెపి బ్రేకప్ టైం

Posted: 05/05/2016 11:06 AM IST
This is breakup time for tdp and bjp

అయింది.. అనుకున్నంతా అయింది. ఏపికి కేంద్రం మొన్నటి వరకు మొండి చేయి చూపిస్తున్నా కానీ ఎక్కడో ఓ చోట ప్రత్యేక హోదా సాదిస్తాంలే అన్న ఏపి ప్రజల ఆశలు ఆవిరయ్యాయి. ఎన్నికల ముందు బీజం ప‌డిన టిడిపి, బిజెపి బంధానికి బీట‌లు వార‌క త‌ప్పదు.బీజేపీ, టీడీపీ బ్రేక‌ప్ కూడా త‌ప్ప‌దు. అయితే ఎప్పుడు..ఎలా..ఏ సంద‌ర్భంలో అన్నదే తేలాలి..ఇదీ ప్రస్తుత రాజ‌కీయాలు ప‌రిశీలిస్తున్న వారిలో అత్యధికుల మాట‌. చాలాకాలంగా ప్రధాని మోడీకి, సీఎం బాబుకి మ‌ధ్య స‌ఖ్యత లేదు. అయిన‌ప్పటికీ రాజ‌కీయ అవ‌స‌రాల కోసం ఒక‌రినొక‌రు పొగుడుతూ, పొగిడించుకుంటూ కాలం గ‌డుపుతున్నారు. అందుకే అన్యోన్యంగా సాగాల్సిన స్నేహం ఇలా అతుకుల బొంత‌లా మారిన నేప‌థ్యంలో ఎక్కువ‌కాలం క‌లిసి సాగ‌డం క‌ష్టమేన‌న్న నిర్థార‌ణ‌కు వ‌చ్చేశారు. దానికి త‌గ్గట్టుగానే ఇద్దరి చేత‌లు ఉన్నాయి. అయితే ఎవ‌రికి వారు త‌మ చేతికి మ‌ట్టి అంట‌కుండా త‌న వ్యతిరేకుల‌ను త‌రిమేద్దామ‌ని ఆలోచిస్తున్నారు. అందుకే ఈ బంధం బ్రేక‌ప్ గా మార‌డానికి స‌మ‌యం ప‌డుతోంది. ఇంకా కొంత కాలం ఇదే రీతిలో సాగే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఎన్నిక‌ల స‌మ‌యానికి ఆనాటి ప‌రిస్థితుల‌ను బ‌ట్టి నిర్ణయాలు ఉంటాయ‌న్న అంచ‌నాలు వినిపిస్తున్నాయి.

చంద్రబాబు మాత్రం బీజేపీ ప‌ట్ల ఇంకా వెన‌కాముందూ అడుతున్నట్టు స‌మాచారం. మోడీ నుంచి ఎటువంటి స‌హ‌కారం అంద‌క‌పోయినా , క‌మ‌లంతో క‌లిసే సాగాల‌ని ఆయ‌న భావిస్తున్నారు. దానికి భిన్నంగా బీజేపీని కాద‌ని ముందుకెళితే గ‌తంలో జ‌గ‌న్ విష‌యంలో కాంగ్రెస్ అధిష్టానం వ్యవ‌హ‌రించిన అనుభ‌వం ఆయ‌న క‌ళ్లముందు క‌నిపిస్తోంది. ముఖ్యంగా ఇటీవ‌ల ఏపీలో ఎంప‌ర‌ర్ ఆఫ్ క‌రప్షన్ అంటూ ఆయ‌న మీద సాగుతున్న ప్రచారం నేప‌థ్యంలో కేంధ్రంతో క‌య్యానికి ఆయ‌న సిద్దంగా లేరు. అందుకే ప్రజ‌లు, ప్రతిప‌క్షం నిల‌దీస్తున్నా తాను మాత్రం ప‌ల్లెత్తు మాట అనుకుండా కాల‌యాప‌న చేస్తున్నారు. ఏపీ అభివృద్ధికి చంద్రబాబు పెద్ద అడ్డంకి అంటూ విమ‌ర్శలు వ‌స్తున్నా ఎదురుదాడితో కాల‌యాన చేయ‌డం త‌ప్పితే గ‌ట్టిగా తేల్చుకునే ప‌ట్టుద‌ల‌కు పోవ‌డం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్పుడు బీజేపీ, టీడీపీ బంధం క‌మ‌ల‌నాధుల క‌న్నా చంద్రబాబుకే ఎక్కువ అవ‌స‌రం అన్న రీతిలో క‌నిపిస్తోంది. స‌రిగ్గా దానినే బీజేపీ కేంధ్ర‌, రాష్ట్ర స్థాయి నేత‌లు అవ‌కాశంగా మ‌ల‌చుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై ఘాటు విమ‌ర్శలు చేయ‌డ‌మే కాకుండా , పోల‌వ‌రం, అమ‌రావ‌తి వంటి విష‌యాల్లో శ్వేత‌ప‌త్రం కోసం నిల‌దీస్తున్నారు. అయిన‌ప్పటికీ టీడీపీకి ఎటూ పాలుపోవ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌న్నీ క‌లిసి క‌థ‌ను 2019 వ‌ర‌కూ న‌డిపించే ప్రయ‌త్నం మాత్రం సాగుతోంద‌ని స్పష్టంగా చెప్పవ‌చ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles