తెలంగాణలో టెట్, ఎంసెట్ తేదీలు ఖరారు | Telangana govt announce TET and Eamcet exam dates

Telangana govt announce tet and eamcet exam dates

Telangana, TET, Eamcet, Kadiyam Srihari, TET Exam, EAMCET Exam, టెట్, ఎంసెట్, తెలంగాణ

Telangana Deputy CM Kadium Srihari announce TET and EAMCET exam dates. Telangana delayed for these competitative exams.

తెలంగాణలో టెట్, ఎంసెట్ తేదీలు ఖరారు

Posted: 05/03/2016 08:14 AM IST
Telangana govt announce tet and eamcet exam dates

తెలంగాణలో గతకొంత కాలంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విషయంలో ప్రభుత్వం అంతకంతకు తాత్సారం చేస్తూ వస్తోంది. ఇప్పటికే చాలా ఆలస్యమైందని అనుకుంటున్న టెట్ పరీక్ష మీద తెలంగాణ సర్కార్ మరోసారి పొడగింపు ప్రకటన చేసింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం లో ఎంసెట్, టెట్ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. డిప్యూటీ సిఎం కడియం శ్రీహరి వీటి మీద క్లారిటీ ఇచ్చారు. మే 15న ఎంసెట్, మే 22న టెట్ పరీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. మే 12 నుంచి ఎంసెట్ హాల్ టికెట్లను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడు చేసుకోవచ్చని తెలిపారు.

13 నుంచి టెట్ హాల్ టికెట్లను వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఎంసెట్ ఆన్‌లైన్ పరీక్షల కోసం హైదరాబాద్, వరంగల్‌లో సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మే 27న ఎంసెట్ ర్యాంకులను ప్రకటిస్తామన్నారు. జూన్‌లో ఎంసెట్ కౌన్సెలింగ్ ఉంటుందని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రాల్లో సీసీ టీవీ కెమెరాల నిఘా ఏర్పాటు చేస్తున్నామన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles