jagan shows Chandrababu naidu videos in pressmeet

Jagan shows chandrababu naidu videos in pressmeet

YS Jagan, Jagan, Chandrababu Naidu, Chandrabab, YSRCP, AP, Special Status, ప్రత్యేక హోదా, ఏపి, జగన్, చంద్రబాబు నాయుడు

YS Jaganmohan Reddy shows AP CM Chandrababu Naidu videos. He clarify on Chandrababu naidu stand on Special Status for AP.

ITEMVIDEOS: జగన్ చూపిన ‘చంద్రబాబు వీడియో’

Posted: 04/30/2016 01:47 PM IST
Jagan shows chandrababu naidu videos in pressmeet

ఏపికి ప్రత్యేక హోదా మీద నిన్న రాజ్యసబలో రచ్చరచ్చ జరిగింది. ఫైనల్ గా ఏపికి అన్ని రకాల ప్రయోజనాలు కల్పిస్తాం, విభజన చట్టంలోని హామీలను నెరవేస్తామని కేంద్రం వెల్లడించింది. కానీ ప్రత్యేక హోదా ఇవ్వడం మాత్రం కుదరదని తేల్చేసింది. దాంతో ఏపిలో ఆగ్రహ జ్వాలలు భగ్గుమన్నాయి. దీని మీద ఈ ఉదయం ప్రెస్ మీట్ పెట్టిన జగన్ కొన్ని నిజాలను వెల్లడించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేని కేంద్రంలో ఎందుకు కొనసాగుతున్నారని.. వెంటనే కేంద్రానికి తమ మద్దతు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో చంద్రబాబు నాయుడు వైఖరి మీద మండిపడ్డారు. అయితే ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు నాయుడు వీడియోను చూపించారు. ఇప్పుడు దాని మీద చర్చ సాగుతోంది.

ఏపికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ పై కేంద్ర ప్రభుత్వం దాదాపుగా క్లారిటీ ఇచ్చేసింది. ఇవాళ.. ఇవాళ అంటూ సాగదీస్తున్న ప్రత్యేక హోదా పై క్లారిటీకి మొత్తానికి ఎండ్ కార్డ్ పడింది. అయితే దీనికి కారణం చంద్రబాబు నాయుడే అంటూ ప్రతిపక్ష నాయకుడు వైయస్ జగన్ ఓ వీడియోను మీడియాతో పంచుకున్నారు. తిరుపతిలో ఎన్నికల సందర్భంగా ఐదేళ్లు, పదేళ్లు కాదు ఏకంగా పదిహేనేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు వీడియో ఉంది. తర్వాత ప్రత్యేక హోదా సంజీవని కాదు అని మరో క్లిప్.. కేంద్రం ప్రత్యేక హోదా ఇస్తానంటే తాము మద్దంటామా, కోడలు మగబిడ్డనిస్తానంటే అత్త వద్దంటుందా అని సామెత చెప్పిన క్లిప్. చివర్లో ప్రత్యేక హోదా వల్ల ఏపికి పెద్దగా వచ్చేలాభం లేదని మరోసారి.. ఇలా మాట మార్చిన చంద్రబాబు క్లిన్ లు చూపించి బాబును కడిగేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles