slippers thrown at actress vindya in tamilnadu by own party men

Slipper thrown at actress vindya

slipper thrown, Actor Manobala, Actress Vindya, Election campaign, AIADMK activists, Slippers, AIADMK, Election campaign, Manobala actor, jayalalithaa, RK Nagar, celebrities, kollywood

the pulse of voters of tamilnadu are in favour of present government says pre polls surveys, but the incident which took place on actress vindya and actor manobala doesnt show the same in Tamilnadu

ప్రముఖ నటికి చేదు అనుభవం.. చెప్పులు విసిరిన ప్రజలు..

Posted: 04/30/2016 10:39 AM IST
Slipper thrown at actress vindya

తమిళనాడు అసెంబ్లీకి జరుగుతున్న ఎన్నికలలో అధికార అన్నాడిఎంకే పార్టీకి మద్దత్తుగా ప్రచారం నిర్వహిస్తున్న సెలబ్రిటీలకు, ముఖ్యంగా సినీ నటీనటులకు చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తమిళనాడులో మళ్లీ అధికార పార్టీయే అధికారంలోకి వస్తుందని ప్రీ ఫోల్స్ సర్వేలలో స్పష్టం అవుతుండగా, అక్కడి చోటుచేసుకుంటున్న పలు ఘటనలను పరిశీలిస్తే మాత్రం కొంత అనుమానం రేకెత్తుతుంది. మొన్న అన్నడిఎంకే పార్టీ తరపున ప్రచారం చేస్తున్న నటుడు మనోబాలకు పరాభవం ఎదురుకాగా, తాజాగా నటి వింద్యాకు కూడా అదే తరహా లో చేదు అనుభవం ఎదురైంది.

స్వయంగా అన్నా డీఎంకే పార్టీ అధ్యక్షురాలు, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత బరిలో నిలిచిన అర్కే నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్న మనోబాలకు మూడు రోజుల క్రితం ఎదురైన పరాభవం ఏకంగా రాష్ట్రవ్యాప్తంగా అధికార పార్టీ ఉనికినే ప్రశ్నించేట్లుగా వుంది. ఆయన ప్రసంగిస్తున్న సమయంలో మనోబాలపై అక్కడి ప్రజలు చెప్పులు విసిరి తమ ప్రకోపాన్ని చాటారు. ఓపెన్‌ టాప్ జీపులో ప్రచారం చేస్తూ వాషర్‌మెన్‌పేటలోకి అడుగుపెట్టిన ఆయన మేడపై నుంచి చెప్పులను విసిరేశారు.

తాజాగా తిరువారూరు సమీపాన నటి వింద్య ఎన్నికల ప్రచారంలోనూ అదే తరహా చేదు అనుభవం ఎదురైంది. అమె ఎన్నికల ప్రచారం చేస్తుండగా అన్నాడీఎంకే కార్యకర్తలు చెప్పులు విసరడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. తిరువారూరు జిల్లా, నన్నిలం నియోజకవర్గంలో రెండవ సారిగా పోటీ చేస్తున్న మంత్రి కామరాజ్‌కు మద్దతుగా వలంగైమాన్, కుడవాసన్, నన్నిలం ప్రాంతాలలో నటి వింద్య బుధవారం రాత్రి ప్రచారం చేశారు. నన్నిలం బస్టాండు సమీపాన జరిగిన ప్రచార సభలో అక్కడ అన్నాడీఎంకే వర్గాలు గుమికూడాయి. ఆ సమయంలో రాత్రి 9.55 గంటలకు అక్కడికి వచ్చిన వింద్య సమయం మించిపోవడంతో తాను మాట్లాడలేనని, క్షమించాలని కోరుతూ తన ప్రసంగాన్ని ఆపారు.

దీంతో ఆగ్రహించిన కార్యకర్తలు కొందరు వింద్యను ఏకపదజాలంతో అమెను దూషించారు. కొందరు ఆమెపై పాదరక్షలు విసిరారు. దీంతో అన్నాడీఎంకే వర్గాల మధ్యే ఘర్షణ ఏర్పడింది. దీన్ని అక్కడున్న వీడియో, ఫోటోగ్రాఫర్లు చిత్రీకరించేందుకు ప్రయత్నించగా విద్యుత్ సరఫరా నిలిపివే శారు. దీంతో నటి వింద్య అక్కడి నుంచి దిగాలుగా వెళ్లిపోయింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles