Shatrughan Sinha | Bihar's brand ambassador | MP Rekha | Javed akthar

Shatrughan sinha would love to be bihar s brand ambassador

shatrughan sinha, bihar, bihar ambassador, nitish kumar, nitish shatrughan sinha, shatrughan sinha news, shatrughan sinha bihar, shatrughan sinha actor, MP Rekha, Javed akthar, bihar news, india news

Shatrughan Sinha today said if approached he would be happy to promote Bihar as its brand ambassador.

బీహార్ అంబాసిడర్ గా నన్ను ఎంపిక చేస్తే.. సంతోషంగా అంగీకరిస్తా..

Posted: 04/29/2016 06:21 PM IST
Shatrughan sinha would love to be bihar s brand ambassador

బిహార్ బీజేపి పార్లమెంటు సభ్యుడు కేంద్ర మంత్రివర్గంలో తనకు కూడా స్థానం వస్తుందని ఆశపడి భంగపడ్డా.. ఇటీవల జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికలలో ముఖ్యమంత్రి పదవిని ఆశించి కూడా భంగపడి.. ఇక చివరకు తన బిహార్ రాష్ట్రానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉండాలనుకుంటున్నారు. బీహార్ లో వున్నది అర్జేడి. జేడియు, కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం. అయితేనేం తనను బ్రాండ్ అంబాసిడర్ గా వుండమంటే మాత్రం తాను సంతోషకంగా అంగీకరిస్తానని తమ మదిలో వున్న అకాంక్షను బయటపెట్టారు బీజేపి ఎంపి.

ఇంతకీ ఆయనెవరో తెలుసా.. బాలీవుడ్ స్ర్కీన్ ను ఒకనాటి రోజుల్లో ఏలిన నాటి తరం హీరోలలో ఆయన ఒకరు. అభిమానులు ముద్దుగా ఆయనను షాట్ గన్ అని పిలుచుకుంటారు ఆయనే శత్రుఘ్నసిన్హా. తనను బిహార్ అంబాసిడర్ గా ఉండమంటే సంతోషంగా అంగీకరిస్తానని ఆయన చెప్పారు. బిహార్ ప్రచారకర్తగా తనను ప్రమోట్ చేస్తే హర్షిస్తానని అన్నారు. 'బిహారి బాబు'గా సుపరిచితుడైన శత్రుఘ్నసిన్హాను బిహార్ బ్రాండ్ అంబాసిడర్ నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం తరపున తనను ఎవరూ సంప్రదింలేదని ఆయన తెలిపారు.

'అధికారికంగా నాతో ఎవరు చర్చలు జరపలేదు. బిహార్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యత ప్రియ మిత్రుడు నితీశ్ కుమార్ నాకు అప్పగిస్తే, తన సొంత రాష్ట్రంకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాను. బిహార్ భూమి పుత్రుడిగా ఇది నా బాధ్యతగా భావిస్తున్నా'ని శత్రుఘ్నసిన్హా అన్నారు. ఈ విషయంలో తన నుంచి డిమాండ్ లేదా కమాండ్ ఏమీ లేదని జైపూర్ నుంచి ఫోన్ లో పీటీఐతో చెప్పారు. నితీశ్ కుమార్ పాలన బాగుందని, ఆయన తనకు తమ్ముడు లాంటివాడని 70 ఏళ్ల సిన్హా పేర్కొన్నారు. కాగా, ఎంపీ రేఖ, రచయిత జావేద్ అక్తర్ పేర్ల పరీశీలనలో వున్నాయని సమాచారం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatrughan Sinha  Bihar's brand ambassador  MP Rekha  Javed akthar  Nitish kumar  

Other Articles