Biloxi woman walks topless from Mississippi to Washington

One woman s 1 000 mile topless walk

topless woman walk, topless woman 1000 mile walk, Biloxi woman walks topless from Mississippi to Washington, Paulette Leaphart, leaphart topless walk, filmmaker Emily MacKenzie, documentary, leaphart documentaty, scar story

Paulette Leaphart will begin the long walk from Biloxi, Mississippi, to Washington, D.C., in the name of breast cancer awareness.

ITEMVIDEOS: టాప్ లెస్ గా వెయ్యి మైళ్లు నడకకు సంకల్పించి మహిళ..

Posted: 04/26/2016 10:18 AM IST
One woman s 1 000 mile topless walk

అమె ఒక సామాన్యురాలు. ఒక్కసారిగా సెలబ్రిటీ స్టేటస్ వచ్చింది. అదెలా అంటే అమె చేయబోయే పనే అమెకు సెలబ్రిటీ స్టేటస్ ను అందించిపెట్టింది. ఇంతకీ అమె చేస్తానన్న పనేంటి అంటే.. టాప్ లెస్ గా నడవటం. అదేంటి ఇలా చాలా మంది చేస్తున్నారు కదా.. మరి ఈమెకే ఎందుకు ఈ స్టేటస్ అంటారా..? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వెయ్యి మైళ్లు అమె తన ఒంటి పైభాగాన ఏమీ లేకుండా నడుస్తానని చెప్పింది. మిస్పిస్పిప్పీ లోని బిలోక్సీ నుంచి వాషింగ్టన్ డిసీ వరకు నడకను ప్రారంభించాలని అమె తలపించింది. అంతే వెనువెంటనే అమె ఈ మేరకు ప్రకటనను వెలువరించింది.

ఎందుకిలా చేస్తుంది.. అసలు టాప్ లెస్ గా 1000 మైళ్లు నడిచేందుకు ఈమెకు అనుమతి వుందా..? అంటే వాటినన్నింటినీ ఒక స్వచ్చంధ సంస్థ చూసుకుంటుంది. ఈమెకు స్వచ్చంధ సంస్థకు ఏమిటీ సంబంధం అంటే అమె చేపట్టిన ఈ టాప్ లెస్ వాక్ తన ఎద అందాలను అరబోసి.. మగవారితో శభాష్ అనిపించుకునేందుకు కాదు. మహిళాలోకం ఎదుర్కోంటున్న బ్రెస్ కాన్సర్స్ కు పై వారికి అవగాహన కల్పించేందుకేనంటోంది. ఎందుకిదంతా చేస్తుందని ప్రశ్నలు కూడా ఉత్పన్నం కాక తప్పవు. ఇంతకీ అమె ఎవరు..?

పౌలెట్టి మెక్ కెన్జీ లీప్ హార్ట్ ఒక సాధారణ మధ్యతరగతి మహిళ. అమె చిన్నప్పుడే తనవారిని పోగోట్టుకుంది. అరేళ్ల వయస్సులో బంధువుల ఇళ్లలో ఆశ్రయం తీసుకుంది. ఈ నేపథ్యంలో అమెను కొంతకాలం అయ్యాక బంధువులు కూడా బయటకు పంపిచేశారు. దాంతో చర్చిలోనే ఆశ్రయం పోంది, తనెదురుగా అనాధలు కనిపిస్తే ఆమె సర్వం అనుకున్నట్లుగా వారిని పెంచి పోషిస్తానని ప్రమాణం చేసింది, అమె ప్రస్తుతం అలా ఎనమిది మంది అనాధ పిల్లలకు తల్లైంది. భర్తతో కూడా తెగదెంపులు కావడంతో అమె ప్రస్తుతం తన పిల్లలతోనే వుంటోంది, ఇదంతా చేసేందుకు అమె సంపన్నురాలు కాదు.. అలా అని కడు పేదరాలు కూడా కాదు, మధ్యతరగతి మహిళ.

2014లో తన అక్క బ్రెస్ట్ కాన్సర్ తో చనిపోయిన తరువాత అమెకు కూడా అలాంటిదే ఏదో జరుగుతుందన్న అనుమానం కలిగింది. మమోగ్రామ్ లో ఏమీ కనబడలేదు. దీంతో అమె అల్ట్రా సౌండ్ పరీక్షకు చేసుకుంది, అప్పుడే తెలిపింది అమెకు తాను కూడా బ్రెస్ట్ కాన్సర్ భారిన పడ్డానని. అప్పటికే త్రీవంగా వ్యాపిస్తున్న దానిని అరికట్టేందుకు డబుల్ మాసెక్టమీ చేయించుకోక తప్పలేదు, దీంతో అమె రెండు వక్షోజాలను కోసి వైద్యం చేుశారు వైద్యులు. దీంతో అమె అవి లేకుండా కూడా మనజాలమని చాటిచెబుతూ.. టాప్ లెస్ గా వెయ్యి మైళ్ల నడకకు అంకురార్పణకు సిద్దం కానుంది. ఇది ముగిసే సమయానికి లీప్ హార్ట్ తన జన్మదినాన్ని కూడా జరుపుకోనుంది.

తాను మాసెక్టమీ చేయించుకునే సమయంలో తనకు ఎదురైన సమస్యలు, ప్రశ్నలు, ఇబ్బందులను అమె మహిళా లోకంతో పంచుకోనుంది. తాను వక్షోజాలను లేకుండా మహిళనని ఎలా ప్రపంచానికి చెప్పగలను..? అసలు తానెలా మనగలను అన్న ప్రశ్నలు అమెను తోలిచేసినా.. తప్పనిసరి పరిస్థితులకు తలొగ్గి అమె చికిత్స చేయించుకుంది. తనకు ఎదురైన ప్రశ్నలు, సమస్యలను మహిళా లోకానికి చెబుతూ, వారికి అవగాహన కల్పించేందుకే అమె తన కథ, దాని వెనుక దాగిన వ్యధను చెప్పనుంది. అమె ఈ వెయ్యి మైళ్ల నడకను స్కార్ స్టోరీ పేరుతో ఎమిలీ మెక్ కెన్జీ డాక్యుమెంటరీని కూడా తీయనుంది. ఇలా తన అలోచనతో సాధరణ మహిళ కూడా సెలబ్రిటీగా మారింది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paulette Leaphart  topless walk  breast cancer  biloxi  washington  Emily MacKenzie  scar story  

Other Articles