Touching a Mumbai bar dancer or throwing money at her can land you in jail

New maharashtra bill sets tough conditions for dance bars

Maharashtra, dance bar bill, Devendra Fadnavis, Mumbai dance bars, Bombay High Court, dance bars, Maharashtra Legislative Council, Maharashtra Legislative Assembly, Maharashtra, Mumbai, Sex work, Supreme Court,

The Maharashtra Legislative Council approved the new dance bar bill and it is likely to be tabled in the state Assembly on Tuesday.

డ్యాన్సర్లును ముట్టుకున్న, డబ్బులు వెదజల్లినా జైలుకే...

Posted: 04/12/2016 08:48 AM IST
New maharashtra bill sets tough conditions for dance bars


ముంబయి బార్ డ్యాన్సర్లకు సంబంధించిన సవరణ బిల్లుకు మహారాష్ట్ర శాసన మండలి అమోదం లభించింది, ముంబయి డాన్సర్లపై, వారి నృత్యాలను అస్వాదించేందుకు వచ్చిన కస్టమర్లపై పలు అంక్షలను విధిస్తూ తీసుకున్న సవరణ బిల్లును ఎలాంటి చర్చ లేకుండా మండలి అమోదం తెలిపింది, దీంతో డాన్స్ బార్లలో బార్ డాన్సర్లను ముట్టుకున్నా, వారిపై డబ్బులు వెదజల్లినా ఇకపై జైలుకు వెళ్లాల్సి వస్తుంది. ఈ మేరకు మహారాష్ట్ర క్యాబినెట్ కొత్త బిల్లును ఆమోదించింది.

ఇవాళ ఈ బిల్లు మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే అధికార పక్షం మాత్రం ఎలాంటి అభ్యంతరాలు లేకుండా ఈ బిల్లు అసెంబ్లీలో కూడా అమోదం పోందుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తుంది, దీంతోబార్లలో డ్యాన్స్ చేసే సమయంలో డ్యాన్సర్లను ముట్టుకున్న వారికి, వారిపై డబ్బులు విసిరిన వారికి జైలు శిక్షతో పాటు రూ.50,000 వరకు జరిమానా, ఎటువంటి అనుమతులు లేకుండా డ్యాన్స్ బార్ నిర్వహించే వారికి రూ.25 లక్షలు జరిమానా విధించేలా ఈ కొత్త బిల్లును రూపొందించినట్లు సమాచారం.

డ్యాన్సర్లు ధరించే దుస్తులు అతి కురచగా ఉండకూడదని, శరీరాన్ని కప్పి ఉంచకుండా ఉండే దుస్తులు ధరించకూడదని, అసభ్యంగా డ్యాన్స్ చేయకూడదని, డ్యాన్స్ బార్ ప్రవేశ ద్వారాల వద్ద సీసీటీవీల ఏర్పాటు, ఒక నెల రోజులకు సంబంధించిన వాటి రికార్డింగ్ లు బార్ యజమానుల వద్ద ఉండాలని, స్వార్థ ప్రయోజనాలకు డ్యాన్సర్లను ఉపయోగించుకోవాలని చూసే యజమానులకు రూ.10 లక్షలు జరిమానా లేదా మూడేళ్ల జైలు శిక్ష తప్పవనే అంశాలు ఆ కొత్త బిల్లులో ఉన్నట్లు సమాచారం.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maharashtra  dance bar bill  Devendra Fadnavis  Mumbai dance bars  

Other Articles