Two unknow persons harrassed lovers in karnataka.

Two unknow persons harrassed lovers in karnataka

Karnataka, Thamakur, Lovers, Sediction

In Karanataka, Thamakur dist lovers went to a Hill to spend some time. Two persons film a video harrssed them.

లవర్స్ బట్టలు విప్పించి.. రేప్ చేయబోతే

Posted: 03/23/2016 10:53 AM IST
Two unknow persons harrassed lovers in karnataka

ఈ మధ్యన ప్రేమికులను వేధిస్తున్న ఘటనలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. ఒంటరిగా ఉన్న లవర్స్ ను బెదిరించడం, ఏకాంతంగా గడుపుతున్న టైంలో వీడియో తీసి వాళ్లను బెదిరించడం లాంటివి ఎక్కువవుతున్నాయి. తాజా కర్ణాటకలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ కొండ మీద ఏకాంతంగా గడుపుతున్న ఇద్దరు లవర్స్ ను ఆకతాయిలు పట్టుకున్నారు. వారి వీడియో తీసి బెదిరించారు. మొత్తం బట్టలు వదిలేసి, నగ్నంగా నిలబడాలని బెదిరించారు.. లేదంటే వీడియో నెట్ లో పెడతామని బెదిరించడంతో వారు బట్టలు వదిలి నిలబడ్డారు.

అలా నిలబడ్డ అమ్మాయి మీద ఆ ఇద్దరు వ్యక్తులు రేప్ చెయ్యడానికి ప్రయత్నించారు. భయంతో పరుగులు పెట్టిన లవర్స్.. రాత్రంతా కొండ మీదే గడిపారు. ఆకులను కప్పుకొని కొండ దిగి ఓ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తుల సహాయంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ ఇద్దరి మీద కేసు పెట్టారు. కర్ణాటకలోని తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా కేంద్రం సమీపంలో ఉన్న శ్రీ సిద్దర కొండపై ఆదివారం చోటు చేసుకుంది. చిక్కనాయకనహళ్లికి చెందిన యువతి, యువకుడు తుమకూరులోని గార్మెంట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Karnataka  Thamakur  Lovers  Sediction  

Other Articles