Bring Vijay malya i will pay fine

Bring vijay malya i will pay fine

Vijay malya, kingfisher, Mumbai, banks, Premalatha

In a strange incident, a ticketless traveller brought in Vijay Mallya's name in an argument, instead of paying the fine for her offence. According to Mumbai Mirror, Premlata Bhansali, a South Mumbai resident of a posh society, was caught travelling without a ticket by a lady ticket checker at the Mahalaxmi station. Bhansali was asked to pay a fine of Rs 260 for this.

మాల్యాను తీసుకురండి.. ఫైన్ కడతా

Posted: 03/23/2016 08:58 AM IST
Bring vijay malya i will pay fine

విజయ్ మాల్యా కొన్ని నెలల క్రితం వరకు పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్న ఈ పేరు వింటే ఇప్పుడు చాలా మందికి వణుకుపుతోంది. మరికొంత మందికి కోపం వస్తోంది. తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులను బ్యాంకుల నుండి తీసుకొని దేశం వదిలి ఎంచక్కా ఎగిరిపోయిన ఈ బడా బిజినెస్ బాబు మీద దేశంలో చాలా మందికి కోపంగా ఉంది. మొన్నామధ్యన ఓ రైతు బ్యాంకు రుణాన్ని తీర్చకపోతే.. పోలీసులు లాఠీలతో బాదడంతో అతడి బార్య పోలీసుల మీద తిరగబడి.. విజయ్ మాల్యా లాంటి వ్యక్తి తొమ్మిది వేల కోట్లు నొక్కితే ఏమనరు కానీ నా భర్తను చితకబాదుతారా అని ప్రశ్నించింది. వీలైతే విజయ్ మాల్యాను కూడా ఇలా నే కొడతారా అని నిలదీసింది. తాజాగా మరో మహిళ ఫైన్ కట్టమంటే విజయ్ మాల్యాను తీసుకురండి కడతా అని రచ్చ చేసింది.

ప్రేమలతా భన్సాలీ అనే మహిళ ముంబై సబర్బన్ రైల్లో టికెట్ లేకుండా ప్రయాణిస్తూ మహాలక్ష్మి రైల్వేస్టేషన్ వద్ద టికెట్ చెకింగ్ అధికారికి పట్టుబడ్డారు. టికెట్ లేనందుకు 260రూపాయలు జరిమానా కట్టాలని అడిగితే, బ్యాంకులకు 9వేల కోట్ల అప్పున్న విజయ్ మాల్యాను అరెస్టు చేసి, ఆయనతో ఆ సొమ్ము కట్టించాలని.. అప్పుడు తాను జరిమానా కడతానని చెప్పారు. అలా దాదాపు 12 గంటల పాలు రైల్వే అధికారులతో వాదిస్తూనే ఉన్నారు. విజయ్ మాల్యాను ఏమీ అనకుండా వదిలేసి, ఆయన వస్తానన్నప్పుడే రావాలంటూ సన్నాయినొక్కులు నొక్కుతున్న అధికారులు సామాన్యులను మాత్రం ఎందుకింత వేధిస్తున్నారని ప్రశ్నించారు. చివరకు ఆమె భర్త రమేష్‌ భన్సాలీని పిలిపించినా ఆయన కూడా ఈ విషయంలో తాను చేయగలిగింది ఏమీ లేదని.. అంతా ప్రేమలత ఇష్టమేనని స్పష్టం చేశారు. దాంతో ఏం చేయాలో తెలియక జుట్టుపట్టుకున్న రైల్వే పోలీసులు.. ఆమెను మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. అక్కడ కూడా ఆమె జరిమానా మాత్రం కట్టనని, కావాలంటే జైలుకు వెళ్తానని చెప్పిందట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay malya  kingfisher  Mumbai  banks  Premalatha  

Other Articles