CM Oommen Chandy uses Facebook to live chat with voters

Cm oommen chandy uses facebook to live chat with voters

Oomen Chandy, Kerala, facebook, facebook chating, voters, kerala polls

Kerala Chief Minister Oommen Chandy went live on Facebook to reach out to voters in the state. He interacted live with people for 30 minutes from 9 pm last night. It was a big hit with people asking questions on various issues ranging from controversial topics like exempting Vigilance department from the RTI's purview, 'Karuna and metran kayal' land deals, Kochi metro rail and Kannur airport projects, among others.

జనాలతో ఫేస్ బుక్ ద్వారా సిఎం చాటింగ్

Posted: 03/23/2016 06:25 AM IST
Cm oommen chandy uses facebook to live chat with voters

సోషల్ మీడియా జనాలను దగ్గర చేసింది. ఎంతో పెద్ద సమస్య ఉన్నా... దాన్ని వివరిస్తూ సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ పెడితే చాలు వెంటనే పరిష్కారం లభిస్తుంది. అందుకే సెలబ్రెటీలు, పొలిటికల్ లీడర్లు ఇప్పుడు సోషల్ మీడియా బాటపట్టారు. తాజాగా కేరళలో ఎన్నికల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో ఓటర్లలను కలిసి, ఓట్లు అడగడం కొత్త టెక్నిక్.. కేరళ సీఎం ఊమన్ చాంది.. సోషల్ నెట్ వర్క్ .. ఫేస్ బుక్ లో ఓటర్లతో లైవ్ చాటింగ్ చేస్తూ.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తరుపున ప్రచారం సాగిస్తున్నారు. దేశంలో ఓటర్లతో సంభాషించేందుకు ఫేస్ బుక్ ఎంచుకున్న తొలి సీఎంగా ఊమన్ చాందీ రికార్డులకు ఎక్కారు.

సోమవారం ఉదయం 9 గంటలనుంచి అరగంట సేపు ఫేస్ బుక్ లో చాటింగ్ చేస్తూ.. సమాజంలో వివిధ వర్గాలకు చెందిన పలువురువ్యక్తులతో సంభాషించారు. తమ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. అలాగే పలు అంశాలపై చర్చించారు. విజిలెన్స్ విభాగాన్ని ఆర్టీఐ పరిధినుంచి తప్పించడం, కోచి మెట్రోరైల్, కన్నూర్ ఎయిర్ పోర్ట్ ప్రాజెక్టు తో సహా పలు అంశాలపై జనం నిలదీశారు. ఈ ఏడాది నవంబర్ నుంచి కన్నూర్ విమానాశ్రయం లో విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయని సీఎం ఊమన్ చాంది తెలిపారు. ఫేస్ బుక్ ద్వారా ప్రజలతో సంభాషించడం చాలా ఆనందం కల్గించిందన్నారు. కేరళలో సంపూర్ణ మద్యనిషేధానికి మద్దతు ఇవ్వాలని ఊమన్ చాంది ప్రజలకు వివరించారు. ప్రజలతో, ఓటర్లతో నేరుగా సంభాషిస్తున్న తొలి ముఖ్యమంత్రి గా పేరుతెచ్చుకున్న చాంది 2013 సంవత్సరానికి గానూ యూఎన్ పబ్లిక్ సర్వీస్ అవార్డు విజేత.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oomen Chandy  Kerala  facebook  facebook chating  voters  kerala polls  

Other Articles