Jeevan Reddy threw papers on the desk of Minister for Agriculture Pocharam Srinivas Reddy

Jeevan reddy threw papers on the desk of minister for agriculture pocharam srinivas reddy

Telangana, Assembly, Jeevan Reddy, Pocharam Srinivas Reddy, Kadiyam Srihari

During his speech, Jeevan Reddy, however, threw papers on the desk of Minister for Agriculture Pocharam Srinivas Reddy which didn't go down well

తెలంగాణ మంత్రిపైకి కాగితాలు విసిరిన ఎమ్మెల్యే

Posted: 03/21/2016 07:46 AM IST
Jeevan reddy threw papers on the desk of minister for agriculture pocharam srinivas reddy

తెలంగాణ బడ్జెట్ సమావేశాల సందర్భంగా మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సభలో దురుసుగా ప్రవర్తించారు. కరువు మండలాలపై చర్చ జరగుతుండగా పోచారం వివరణ ఇస్తున్నారు. దీనిపై సంతృప్తి పడని జీవన్‌రెడ్డి ఆయన వద్ద ఉన్న పేపర్లలను మంత్రిపై విసిరారు. దీంతో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. కాగా తెలంగాణ అసెంబ్లీలో ఇలాంటి ఘటన జరగడం ఇదే తొలిసారి. ఏకంగా మంత్రి మీదకు కాగితాలు విసరడం మీద అధికారపక్షం మండిపడుతోంది.

మాజీ మంత్రి, కాంగ్రెస్ సభ్యుడు జీవన్‌రెడ్డి సభలో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి దగ్గరకు వెళ్లి పేపర్లను విసిరివేసి దురుసుగా ప్రవర్తించిన ఘటనపై సభలో పెద్ద రగడే జరుగుతోంది. సభలో జీవన్‌రెడ్డి ప్రవర్తించిన తీరుపట్ల క్షమాపణ చెప్పాలని మంత్రులు డిమాండ్ చేశారు. ఈమేరకు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి మాట్లాడుతూ.. జీవన్‌రెడ్డి మంత్రి పట్ల అలా ప్రవర్తిస్తాడని ఊహించలేదన్నారు. దాదాపు మంత్రిపై దాడి చేసిన విధంగా ప్రవర్తించాడని మండిపడ్డారు. వెంటనే జీవన్‌రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఘటనపై విచారం వ్యక్తం చేశాకే జీవన్‌రెడ్డికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని స్పీకర్‌ను కోరారు. కరువుపట్ల చిత్తశుధ్ధి ఉంటే ప్రతిపక్ష సభ్యులు చర్చకు ముందుకు రావాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Assembly  Jeevan Reddy  Pocharam Srinivas Reddy  Kadiyam Srihari  

Other Articles