CLP leader janareddy makes humour in assembly with telangana accent

Janareddy makes smile in telangana assembly

telangana assembly, telangana budget, janareddy, eetala rajender, eetala rajender budget, janareddy in assembly, janareddy telangana accent, jana reddy humour in assembly, clp leader jana reddy,

Congress Legislative Party leader janareddy makes humour in assembly with telangana accent and comments on telangana budget

ఈటెల బడ్జెట్ పై జానారెడ్డి కవిత.. మరింత గందరోగోళం అని కామెంట్

Posted: 03/16/2016 03:08 PM IST
Janareddy makes smile in telangana assembly

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, తెలంగాణ శాసనసభాపక్ష నేత జానారెడ్డి సర్వసాధారణంగా ఏ అంశంపైన మాట్లాడినా.. దానిని అర్థం చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలాంటి నిష్టాతులైన జానా.. ఇవాళ తన సహజశైలికి భిన్నంగా మాట్లాడారు. అందులోనూ శాసనసభలో ఆయన మాట్లాడిన తీరు విభిన్నంగా వుంది. అంతేకాదు తెలంగాణ యాసలోనే ఆయన మాట్లాడటం విన్న సభ్యులందరూ నవ్వడంతో  అసెంబ్లీలో నవ్వుల హరివిల్లులు పూసాయి.

బడ్జెట్ అంటేనే సాధారణంగా గందరగోళ అంశమని, అలాంటి బడ్జెట్ లెక్కలను చేతులకు ఇచ్చి మంత్రి ఈటల రాజేందర్ మరింత గందరగోళంలో పడేశారని కామెంట్ చేశారు.. ఈ లెక్కలు చాలా జాగ్రత్తగా ఎమ్మెల్యేలు చదువుకోవాలని చెప్పారు. దీంతో అందరూ నవ్వారు. 'సభలో చాలామంది సభ్యులు లేరు. మంత్రులు ఎవరు లేరు. మండలికి పోయినరా' అని చక్కగా తెలంగాణ మాండలికంలో మాట్లాడుతూ సభలో నవ్వులు విరభూయించారు.

తాను ఎంతమేరకు అంచనా వేసి చెప్పానో అంతమేరకే ఈటల బడ్జెట్ కేటాయింపు చేశారని అన్నారు. మిషన్ కాకతీయ నిధుల విషయంలో కూడా అదే జరిగిందని తెలిపారు. తాను పారదర్శకంగా ఉంటానని, అలాంటి పాలనను అందించాలని కోరుకుంటానని జానా అన్నారు. తాను సక్రమంగా లేకుంటే అధికార పక్షం చెప్తే సరవుతానని, లేదంటే అధికార పార్టీ సరవ్వాలని చెప్పారు. ఈటల బడ్జెట్పై చిన్న కవిత లాంటిది కూడా జానా చదివారు. బడ్జెట్ అంకెలతో ఆటపట్టించారని, లెక్కలతో గారడీ చేశారని, ప్రజలను భ్రమింపజేయడానికి ప్రయత్నించారని చెప్పారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana assembly  telangana budget  janareddy  eetala rajender  eetala rajender budget  

Other Articles