Twins in Vietnam Discovered to Have Different Fathers After DNA Test

Dna test shows vietnam twins had different fathers

twins with different fathers, vietnamese twins with different fathers, mia washington, bi-paternal twins, Vietnamese twins, Le Dinh Luong, genetic association of vietnam, difference in physical appearance, fraternal twins, same ovulation period, different facial features, heteropaternal superfecundation

A fourth case of twins being born with different fathers was recorded in Vietnam. The second and third cases, happened in 2009 to a woman named Mia Washington and in 2013 to an unnamed woman in New Jersey. The first was in 1997.

నిజంగా వింతే.. కవలలే కానీ.. తండ్రులు మాత్రం వేరు..

Posted: 03/09/2016 01:02 PM IST
Dna test shows vietnam twins had different fathers

వియత్నాంలో పుట్టిన ఇద్దరు కవలలు పెద్ద చర్చకే తెరలేపారు. ఇద్దరు కవలలు ఒకేలా కాకుండా విభిన్నంగా కనబడుతుండటంతో రెండేళ్ల తరువాత.. అనుమానం వచ్చిన పిల్లల తండ్రి.. ఎందుకిలా జరుగుతుంది. కవల పిల్లలు అయితే ఒకేలా వుంటారు కదా..? మరి తన ఇద్దరు కవల పిల్లలో ఎందుకీ మార్పులు కనిపిస్తున్నాయిని సందేహాన్ని వ్యక్తం చేయడంతో అసలు విషయం బయటపడింది. సాధారణంగా అన్నీ దేశాలలో మాదిరిగానే వియత్నాంలో రెండేళ్ల క్రితం జన్మించిన ఇద్దరు కవలలు.. సామాన్యమైన కవలలు మాత్రం కాదని వైద్యులు తేల్చేశారు.

అదేం వాళ్లలో ఏమిటీ ప్రత్యేకత అనుకుంటున్నారా..? వివరాల్లోకి వెళ్తే.. వియత్నాం ఉత్తర ప్రాంతం హోయా బిన్హ్ లో ఈ విచిత్ర ఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం ఆ కవల చిన్నారుల వయసు రెండేళ్లు. ఓ చిన్నారికి జట్టు చాలా పలుచగా ఉండగా, మరో కవల చిన్నారికి ఎక్కువ వెంట్రుకలు ఉన్నాయి. ఏదో సందేహం వచ్చిన చిన్నారుల తండ్రి డీఎన్ఏ టెస్టుల కోసం కవలల్ని ఆస్పత్రికి వెళ్లారు. కవలలు పుట్టిన సమయంలో డాక్టర్లు పొరపాటుగా చిన్నారుల్ని తారుమారు చేశారేమేనని ఆయన అనుమానపడ్డారు.

పరీక్షలు నిర్వహించిన డాక్టర్లు ఆ కవలలకు అసలు తల్లి ఆమెనని, కానీ తండ్రులు మాత్రం వేరని చెప్పారు. కవలలకు ఫాదర్స్ ఇద్దరు ఉండటం చాలా అరుదైన సంఘటన అని చెబుతున్నారు. మహిళ అండం జీవితకాలం 12 నుంచి 48 గంటలు ఉంటుందని, ఈ సమయంలో ఇద్దరు వ్యక్తుల వీర్యకణాలతో అవి పిండంగా మారడంతో ఇద్దరు కవలలు ఈ విధంగా పుడతారని డీఎన్ఏ టెస్ట్ చేసిన వైద్యులు వివరించారు. ఈ విషయం తెలిసి ఆశ్చర్యపోవడం ఆ తల్లిదండ్రుల వంతు అయింది. రెండో చిన్నారికి తండ్రి ఎవరన్న అనుమానం వారిలో మొదలైంది.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bi-paternal twins  Vietnamese twins  Le Dinh Luong  Genetic Association of Vietnam  

Other Articles