candidates asked to strip down to their underwear for Army exam

Candidates asked to strip down to their underwear for army exam

army, Exam, Bihar, naked exam, Bihar Army exam

After that defining freezeframe from Vaishali last year of people perched on the window shades of a multi-storey building, passing on answer chits to students appearing for exams inside, comes another image from Bihar showing the other side of the coin.

బట్టలు లేకుండా పరీక్ష రాసిన విద్యార్థులు

Posted: 03/01/2016 04:43 PM IST
Candidates asked to strip down to their underwear for army exam

పరీక్ష అంటే అందరికి భయమ.. అయితే బీహార్ లో జరిగిన ఓ ఆర్మీ పరీక్ష మాత్రం నిజంగా భయపెట్టింది. అంతకు ముందు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నారని.. ఏకంగా బట్టలు లేకుండా పరీక్షలు రాయించారు అధికారులు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఆర్మీ విభాగంలో జూనియర్ అసిస్టెంట్  పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు వెళ్లిన విద్యార్థులను ఆర్మీ అధికారులు తనిఖీలు చేసిన సమయంలో దుస్తులు విప్పేసి రావాలని ఆదేశించారు. దీంతో 1,100 విద్యార్థులు ఏమి చేసేది లేక ఒక్క డ్రాయర్ తప్ప మిగిలిన దుస్తులను తొలగించారు. ఆ తర్వాత పరీక్షలకు విద్యార్థులు హాజరయ్యారు. ఇక ఏదో రూమ్‌లో కూర్చోబెట్టి పరీక్షలు రాయిస్తారు అనుకుంటే అది కూడా లేదు. పెద్ద గ్రౌండ్‌లో ఎండలో కూర్చోబెట్టి రాయించారు. కనీసం పరీక్ష రాసేందుకు ప్యాడ్స్‌ను కూడా తీసుకెళ్లనీయలేదు.

తమ తొడలపై ప్రశ్నాపత్రాన్ని పెట్టుకుని పరీక్ష రాయాలని అధికారులు ఆదేశించారు. తప్పని పరిస్థితుల్లో ఆర్మీ అధికారుల మాట విద్యార్థులు వినాల్సి వచ్చింది. ఆర్మీ అధికారులు ఇలా ఎందుకు చేశారంటే.. గత అనుభావాల దృష్ట్యా మాస్ కాపీయింగ్ జరగకుండా ఉండేందుకు దుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షలకు అనుమతించామని అధికారులు తెలిపారు. గతేడాది పది పరీక్షల సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులు భారీగా వారికి చిట్టీలు అందించిన విషయం విదితమే. ఆర్మీ అధికారులు ఇలా చేయడంతో బీహార్‌లో విమర్శలు వెలువెత్తాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : army  Exam  Bihar  naked exam  Bihar Army exam  

Other Articles