Shatrughan Sinha wades into JNU row, asserts Kanhaiya Kumar said nothing anti-national

Bhushan shatrughan sinha come to kanhaiya s aid

shatrughan sinha, jnu, jnu issue, jnu afzal guru, jnu news, jnu protest, bjp, narendra modi, kanhaiya kumar, Prashant Bhushan, Shatrughan Sinha, anti-National protest, jnusu, abvp, india news

Senior Supreme Court lawyer Prashant Bhushan on Wednesday alleged that arrested JNU Student Union President Kanhaiya Kumar has been “falsely implicated” and that he is ready to represent him in court.

సొంత పార్టీ నేతలకు మింగుడుపడని బీజేపి ఎంపీ సిన్హా వ్యాఖ్యలు

Posted: 02/17/2016 03:52 PM IST
Bhushan shatrughan sinha come to kanhaiya s aid

సొంత పార్టీ నేతలకు మింగుడు పడని విధంగా మరోమారు బీజేపీ ఎంపీ శతృఘ్న సిన్హా వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ అయినా.. లోపాలను ఎత్తి చూపుతూ ధైర్యంగా మాట్లాడే శత్రుఘ్నసిన్హా జేఎన్ యూ వివాదంపై స్పందిస్తూ.. తన పార్టీ నేతలతో పాటు మంత్రులను కూడా ఇరాకాటంలో పెట్టారు. ఈ వ్యవహారంలో సొంత పార్టీ నేతలు వ్యవహరిస్తున్న తీరును తప్పుబట్టారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందిస్తూ, "జేఎన్ యూలో జరిగిన ఆ కార్యక్రమంలో కన్నయ్య కుమార్ ప్రసంగం మొత్తం విన్నాను. మా బీహార్ కు చెందిన ఆ యువ నాయకుడు ఎక్కడ కూడా జాతి వ్యతిరేకంగా లేదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఎలాంటి నినాదాలు చేసినట్టు నాకనిపించలేదు. ఈ విషయంలో మా పార్టీకి చెందిన కొందరు నాయకులు అతిగా స్పందించారు" అని సిన్హా పేర్కొన్నారు.

జేఎన్ యూ అంతర్జాతీయంగా కీర్తి గడించిన విద్యాసంస్థ అని, ఎంతో మంది అత్యుత్తమ విద్యార్థులు, ఉపాధ్యాయులున్న ఈ వర్సిటీలో ఇకముందు సంకటస్థితి నెలకొనకుండా బీజేపీ నేతలు ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. వాళ్లు మన సొంత పిల్లలని, వారి జీవితాలపై ప్రభావం చూపే కేసులు పెట్టడం ఎంతవరకు సబబు? అని షాట్ గన్ ప్రశ్నించారు. అతి త్వరలోనే అతను (కన్నయ్య కుమార్) విడుదలవ్వాలని ప్రార్థించాలని సిన్హా ట్విట్టర్ లో కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : JNU row  Prashant Bhushan  Shatrughan Sinha  Kanhaiya Kumar  anti-National protest  

Other Articles