JNU Row | Don’t Need Lessons in Patriotism From BJP: Congress

Congress says doesnt need lessons in patriotism

New Delhi, Jawaharlal Nehru University, Randeep Singh Surjewala, Amit Shah, Rahul Gandhi,JNU row,Randeep Singh Surjewala,Kanhaiya Kumar

Congress spokesman Randeep Singh Surjewala accused the Narendra Modi government of trying to suppress the voices of youth and students

ధేశభక్తి ఫాఠాలు గాడ్సే వారసుల నుంచి నేర్చుకోవాలా..

Posted: 02/15/2016 09:38 PM IST
Congress says doesnt need lessons in patriotism

జేఎన్యూ వివాదం విషయంలో కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. గాంధీ మహాత్ముని చంపిన గాడ్సే వారసుల నుంచి తాము దేశ భక్తి గురించి నేర్చుకోవాల్సిన అవసరం లేదంటూ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రణ్దీప్ సింగ్ సుర్జీవాలా అన్నారు. బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై చేసిన విమర్శలకు ప్రతిగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. గాడ్సే వారసులు దేశభక్తి పాఠాలు వల్లించడం హేయకరంగా వుందన్నారు.

రాహుల్ గాంధీకి జాతీయ భావాలకు, జాతీయ భావాలను వ్యతిరేకించే వాళ్లకు మధ్య తేడా తెలియడం లేదని, దేశభక్తి గురించి ఆయనకేం తెలియదని అమిత్ షా అన్నారు. దీనిపై స్పందించిన రణ్ దీప్ తాము దేశ భక్తి గురించి ఎన్డీయే వద్ద నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు. నేరుగా ఎన్డీయే పేరును ప్రస్తావించకుండా 'ఎవరు మహాత్ముని సిద్ధాంతాన్ని చంపేశారో, ఎవరు నాధురాం గాడ్సే వారుసులో వారి వద్ద నుంచి మేం దేశ భక్తి నిర్వచనాన్ని తెలుసుకోవాలనుకోవడం లేదు' అని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amit Shah  Rahul Gandhi  JNU row  Randeep Singh Surjewala  Kanhaiya Kumar  

Other Articles