A Professor worshiped in nude

A professor worshiped in nude

Chennai, Professor, Nude Worship, Pooja

A Professor from Dhamapuri, worshiped in nude for promotion. Selvaraj named Professor harrased her wife to participate in nude pooja

బట్టలు లేకుండా పూజలు... ప్రొఫెసర్ గారి అతి

Posted: 02/13/2016 10:35 AM IST
A professor worshiped in nude

ఆయన గారు ఓ ప్రొఫెసర్... ఎంతో సీనియార్టీ ఉన్న ప్రొఫెసర్. అయితే గత కొంత కాలంగా ఆయనకు డీన్ కావాలనే కోరిక కలిగింది. అయితే అందుకు ఆయన గారు చేసిన పనులే అందరికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. ఎవరైనా సరే ఏం చేస్తారు... మంచిగా పాఠాలు చెప్పడం.. అందరితో కలిసి ఉండటం లాంటివి చేస్తారు అంతే కానీ పూజలు చేస్తారా..? అయ్యో పూజలు ఎందుకు చెయ్యకూడదు అనుకుంటున్నారా..? పూజలు చెయ్యడం అంటే మామూలుగా కాదు. ఏకంగా ఒంటి మీద ఏమీ లేకుండా పూజలు చేశాడు. పైగా తాను ఒక్కడినే నగ్నంగా పూజలు చేస్తూ బోర్ కొట్టిందని అందుకు తన భార్యను కూడా తనతో పాటు పూజలో కూర్చోవలన్నాడు. ఇతంకీ ఈ ఘటన ఎక్కడ జరిగింది అనుకుంటున్నారా..? తమిళనాడు రాష్ట్రం ధర్మపురిలో.

తమిళనాడు రాష్ట్రం ధర్మపురిలోని ఓ కళాశాలలో సెల్వరాజ్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. అయితే ఆయన మొదటి భార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. అయితే ఉన్నట్టుండి ఆయన ప్రవర్తనలో మార్పును భార్య గమనిచింది. అయితే ఓ రోజు నగ్నంగా పూజలు చెయ్యడం మొదలుపెట్టాడట. అదేంటని అడిగితే డీన్ కావాలంటే పూజలు చెయ్యాలని చెప్పాడట. సరే అని ఆవిడ లైట్ తీసుకుంది. కానీ కొన్ని రోజులకు తనకు ఒక్కడికే పూజ చేస్తుంటే బోర్ కొడుతోందని కాబట్టి తన భార్యను కూడా పూజ చెయ్యమని బలవంత పెట్టాడు. అయితే ఎంతలా నచ్చజెప్పినా కానీ వినని సెల్వరాజ్ ఆమెను చితకబాదాడు. దాంతో ఆస్పత్రిపాలైన ఆమె తన నిర్వాకాన్ని వెలుగులోకి తెచ్చింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chennai  Professor  Nude Worship  Pooja  

Other Articles