Tension in Jawaharlal Nehru National University

Tension in jawaharlal nehru national university

Afzal Guru, JNU, JNTU,Delhi

JNU Students Union president Kanhaiya Kumar Friday afternoon was arrested by Delhi Police in connection with Afzal Guru’s event in the campus. JNU administration had ordered a disciplinary enquiry about the event students held on campus against the hanging of Afzal Guru. The move came after ABVP began protesting in the campus, demanding all the students who ‘misled’ the university about the nature of the events to be expelled.

జవహర్ నేషనల్ యూనివర్సిటీలో ఉద్రిక్తత

Posted: 02/13/2016 10:29 AM IST
Tension in jawaharlal nehru national university

దిల్లీ జవహర్ నేషనల్ యూనివర్సిటీ అట్టుడుకుతోంది. యూనివర్సిటీలో ఉగ్రవాది అఫ్జల్ గురుకు అనుకూలంగా ప్రదర్శనలు, నినాదాలు చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. దీంతో ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు దేశద్రోహం నేరం కింద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. అటు కేంద్రం సైతం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది.  యూనివర్సిటీల్లో ఉగ్రవాదులకు అనుకూలంగా ర్యాలీలు, ఆందోళనలు చేపట్టడం ఏంటని ఏబీవీపీ కార్యకర్తలు, కేంద్ర మంత్రులు మండిపడుతున్నారు. దిల్లీ యూనివర్సిటీలో విద్యార్థులు జాతీయ భావాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయడం మీద సర్వత్రా నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

విశ్వవిద్యాలయంలో సంస్మరణ సభ నిర్వహణ, నినాదాలు చేసిన ఘటన చినికిచినికి గాలివానగా మారుతోంది. ఈ ఘటనకు సంబంధించి యూనివర్సిటీ అధికారులు ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేశారు. ఈ నెల 9న జేఎన్-యూలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో సంస్మరణ సభ నిర్వహించారు. అందులో అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. అఫ్జల్ గురును పొగుడుతూ, దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారని విమర్శలు వెల్లువెత్తాయి. యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ కూడా అఫ్జల్ గురుకు అనుకూలంగా నినాదాలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనే ఇప్పుడు కలకలం రేపుతోంది. దేశద్రోహికి మద్ధతు పలికినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఏబీవీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

జేఎన్-యూలో అఫ్జల్ గురుకు మద్దతుగా కార్యక్రమం నిర్వహించి, పాకిస్తాన్ కు అనుకూలంగా నినాదాలు చేసిన ఘటనలో జేఎన్-యూ విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్ ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా వర్సిటీకి వెళ్లిన పోలీసులు కన్నయ్య కుమార్ ను ప్రశ్నించారు. అనంతరం దేశద్రోహం కేసు కింద అతన్ని అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుంది. దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలను తమ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో సహించబోదని, జెఎన్ యూ వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ పోలీసులను ఆదేశించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Afzal Guru  JNU  JNTU  Delhi  

Other Articles