Telangana cm KCR request to grant thirty thousand crores to Telangana state

Telangana cm kcr request to grant thirty thousand crores to telangana state

KCR, Modi, Telanagana, KCR in Delhi, Delhi, Telangana funds

Telangana cm KCR request to grant thirty thousand crores to Telangana state KCR met Pm Modi and discuss about telangana development

తెలంగాణకు 30 వేల కోట్లు ఇవ్వండి: కేసీఆర్

Posted: 02/12/2016 03:25 PM IST
Telangana cm kcr request to grant thirty thousand crores to telangana state

ప్రధాని నరేంద్ర మోడీతో సమావేశమైన సీఎం కేసీఆర్ పలు అంశాలపై చర్చించారు. సుమారు 40 నిమిషాల పాటు మోడీతో సమావేశమైన సీఎం రాష్ట్ర పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని హామీలను నెరవేర్చాలని ప్రధానిని కోరినట్లు సమాచారం. తర్వాత మధ్యాహ్నం పీయూష్‌గోయల్‌తో సీఎం సమావేశం కానున్నారు. విద్యుత్ ప్రాజెక్టుల అంశంపై ఆయనతో చర్చించనున్నారు. వివిధ థర్మల్ విద్యుత్ ప్లాంట్లకు పర్యావరణ శాఖ నుంచి అనుమతులు లభించాల్సి ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్‌తో కూడా కేసీఆర్ భేటీ అయ్యే అవకాశం ఉంది.

ఇండియన్ సర్వీసు ఉద్యోగులకు సంబంధించిన అంశాలతోపాటు ఇతర సమస్యలపై హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో, రాష్ర్టానికి రావాల్సిన సీఎస్టీ బకాయిలు, ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంపు అంశాలపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో చర్చించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ వెంట రాష్ట్ర మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎంపీలు జితేందర్‌రెడ్డి, వినోద్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి ఉన్నారు. ట్రైబల్ యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా గుర్తించాలని కోరారు. ఇక మిషన్ భగీరథకు రూ. 10 వేల కోట్లు ఆర్థిక సాయం కోరారు. వచ్చే బడ్జెట్‌లో ఎయిమ్స్‌కు నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వెంటనే ఉమ్మడి కోర్టును విభజించి ఏపీకి ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని కోరారు. వచ్చే నాలుగేళ్ల కోసం రూ. 30,571 కోట్లు ప్రత్యేక గ్రాంట్‌ను కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : KCR  Modi  Telanagana  KCR in Delhi  Delhi  Telangana funds  

Other Articles