Sonia, Rahul Gandhi need not appear for court hearings, says Supreme Court

Sonia rahul gandhi need not appear for court hearings says supreme court

Rahul Gandhi, Sonia Gandhi, National Herald, Supreme Court

Supreme Court, Congress president Sonia, Rahul Gandhi, National Herald case

రాహుల్, సోనియాలకు సుప్రీంకోర్టు ఊరట

Posted: 02/12/2016 01:37 PM IST
Sonia rahul gandhi need not appear for court hearings says supreme court

నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్‌కు ఊరట లభించింది. హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ కోర్టు ముందు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ కోర్టు ముందు ఖచ్చితంగా హాజరుకావాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ప్రముఖ నేతలు కోర్టుకు వస్తే పరిస్థితి ఆందోళనకరంగా మారుతుందని సుప్రీం తన తీర్పులో పేర్కొంది. సోనియా, రాహుల్ ప్రముఖ వ్యక్తులు అని, వాళ్లు దేశం విడిచి వెళ్లరు అని కోర్టు తెలిపింది. ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన అన్ని సూచనలను సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే కేసు విచారణ మాత్రం యధావిధిగా కొనసాగుతుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

కాగా అంతకు ముందు కోర్టు ఆదేశాలను బేఖాతరు చేయడం ఏంటి అని దిల్లీ హైకోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ జైలుకు వెళ్లక తప్పదు అని బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి పేర్కొన్నారు. 2016లో ఈ కేసులో తప్పక విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసు విషయంలో ఇప్పటికీ ప్రధాని మోడీతో మాట్లాడలేదని స్పష్టం చేశారు. సోనియా, రాహుల్‌ను కోర్టుకు తీసుకురావడం తాను గొప్పగా ఫీల్ అవుతున్నానని  అంతకు ముందు ఆయన పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Sonia Gandhi  National Herald  Supreme Court  

Other Articles