Fresh setback for TDP in Telangana; another MLA quits

Fresh setback for tdp in telangana another mla quits

SRReddy, S Rajender Reddy, TTDP, TRS, Narayanpet

A day after its floor leader in Legislative Assembly quit the party, TDP in Telangana today suffered a fresh setback with another party MLA announcing his decision to resign. Rajender Reddy, TDP legislator from Narayan Peth in Mahabubnagar district, said he decided to quit the party in the interest of his constituency's development. The MLA regretted he could not do much for his Assembly segment's development in the last 20 months.

ITEMVIDEOS: మరో టిటిడిపి ఎమ్మెల్యే జంప్.. కారెక్కనున్న పదో ఎమ్మెల్యే

Posted: 02/12/2016 08:21 AM IST
Fresh setback for tdp in telangana another mla quits

టిటిడిపికి షాకుల తర్వాత షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీకి చెందిన అందరు సీనియర్ నాయకులు పార్టీకి గుడ్ బై చెబుతుంటే.. తాజాగా మరో ఎమ్మెల్యే సైకిల్ దిగి కారెక్కారు. తెలుగుదేశం ఎమ్మెల్యే వివేకానంద గౌడ్‌, ఎర్రబెల్లి, ప్రకాశ్‌గౌడ్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో టీటీడీపీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ఇందులో పాల్గొన్నారు. ఆయన పక్కనే రాజేందర్‌ రెడ్డి కూడా కూర్చున్నారు. చంద్రబాబు సమక్షంలో ఆయన మాట్లాడారు కూడా. అయితే, సమావేశంలో చంద్రబాబు ముగింపు ఉపన్యాసం చేస్తుండగా, రాజేందర్‌ రెడ్డి బయటకు వచ్చారు. ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌ నుంచి నేరుగా హోటల్‌ తాజ్‌ కృష్ణకు చేరుకున్నారు. అప్పటికే అక్కడ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌, సి.లక్ష్మారెడ్డి ఉన్నారు. వారితో భేటీ అనంతరం తాను టీఆర్‌ఎస్ లో చేరుతున్నట్లు రాజేందర్‌ రెడ్డి ప్రకటించారు

ఈ విషయంపై ఇప్పటికే ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుతో ఫోన్‌లో మాట్లాడానని, ఢిల్లీ పర్యటననుంచి ఆయన తిరిగిరాగానే అధికారికంగా పార్టీలో చేరుతానని చెప్పారు. తెలంగాణలో టీడీపీకి ఉనికి లేకుండా పోయిందన్నారు. కార్యకర్తలు కూడా టీఆర్‌ఎస్ పార్టీలో చేరాలని ఒత్తిడి తెస్తున్నారని వివరించారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని, అందుకే పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తనకు నియోజకవర్గ అభివృద్ధే ముఖ్యమన్నారు. రాజేందర్‌రెడ్డి చేరికతో టీడీపీనుంచి మొత్తం 10 మంది ఇప్పటి వరకు టీఆర్‌ఎస్ పార్టీలో చేరినైట్లెంది. దీనితో టీడీపీ ఎల్పీ టీఆర్‌ఎస్‌ఎల్పీలో విలీనమయ్యేందుకు మార్గం సుగమమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SRReddy  S Rajender Reddy  TTDP  TRS  Narayanpet  

Other Articles