is it lokesh fault that tdp leaders leaving party

Telangana tdp factory closed with secret aggreement

errabelli dayakar rao, prakash goud, tdplp floor leader, tdp leaders, telangana tdp, trs, telangana tdp strength, telangana tdp mlas, chandrababu naidu, nara lokesh, revanth reddy, chandrashekar rao, harish rao

With an secret aggrement between trs and tdp the telangana tdp mla are joining trs

ఒప్పందం మేరకే ఖాయిలాపడ్డ టీటీడీపీ కర్మాగారం..?

Posted: 02/11/2016 05:10 PM IST
Telangana tdp factory closed with secret aggreement

తెలంగాణ టీడీపీ ఖయిలా పడింది. అదేనండీ నాయకులను తయారు చేసే పరిశ్రమ బీటాలు వారింది. తమ పార్టీ నాయకులను తయారు చేస్తుందని ఒక్క నాయకుడు వెళ్తే.. వందల మంది నాయకులు తయారవుతారని గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఊరూరా తిరుగుతూ ప్రచారం చేశారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చి రాగానే.. అక్కడ రాజధాని కోసంమంటూ సింగపూర్, మలేషియా, డిల్లీ లకు పర్యటనల మీద పర్యటనలు చేస్తూ బిజీబిజీగా గడుపుతున్న చంద్రబాబు.. తెలంగాణ బాద్యతలను తన తనయుడు నారా లోకేష్ పై పెట్టారు.

తెరపైకి వచ్చిన వెంటనే ట్విట్టర్ లో తెలంగాణ ప్రభుత్వంపై ట్విట్టర్ ద్వారా అనేక విమర్శలు చేసిన లోకేష్..  ఆ తరువాత కొంత నెమ్మదించాడు. ఓటుకు నోటు కేసు వెలుగుచూసినప్పటి నుంచి అసలు తెలంగాణ ప్రభుత్వం జోలికి రాలేదు, సరికదా విమర్శలు కురిపించడానికి కూడా కాసింత అలోచించినట్లు కనిపించాడు. ఆ తరువాత తాను ముందుకు రాకుండా మొత్తం వ్యవహారాన్ని తన పార్టీ కార్యలయంలోనే చక్కబెట్టేందుకు ప్రయత్నాలు చేశాడు. అటు వరంగల్ ఉప ఎన్నికలలో ఓటమి, ఇటు గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో పరువు పోయిన పరిస్థితి ఎదురుకావడానికి కూడా లోకేష్ యే కారణమని విమర్శలు వినిపిస్తున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికలలో టీడీపీకి కనీసం ఇరవై స్తానాలైనా సాధించివుంటే ఆ క్రెడిట్ తనదని చె్ప్పుకునేందుకు కూడా లోకేష్ సిద్దమయ్యాడని గుసగుసలు వినబడ్డాయి. అయితే కేవలం ఒక్క సీటు మాత్రమే దక్కడంతో ఆ సీను అవిష్కృతం కాలేదన్న విమర్శలు వినబడ్డాయి.

ఈ అంశాన్ని పక్కన బెడితే.. తెలంగాణ టీడీపీలో నాయకులు ఒక్కోక్కరుగా అధికార టీఆర్ఎస్ పార్టీ వైపు మొగ్గడం చర్చనీయాంశంగా మారుతోంది. గ్రేటర్ ఫలితాలు ఇచ్చిన షాక్ నుంచి కోలుకోని టీడీపీ అధినేతను ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు మరింత షాక్ కు గురిచేశారు. వివేక్, ఎర్రబెల్లి, ప్రకాష్ గౌడ్ లు పార్టీని వీడి వలస వెళ్లిపోవడంతో రాజకీయ వర్గాలను విస్మయానికి గురిచేసింది. నిన్న మొన్నటి వరకు ఎంతో బలంగా వున్న పార్టీ ఒక్కసారిగా పటాపంచలు కావడం పట్ల పార్టీ కార్యకర్తలు అందోళన చెందుతున్నారు.

ఈ వ్యవహారమంతా ఒప్పందం మేరకే జరుగుతున్నాయన్న గుసగుసలు కూడా రాజకీయ వర్గాల్లో షికార్లు చేస్తున్నాయి. ఓటుకు నోటు కేసు కుంభ కోణం నుంచి ఎలాగైనా బయటపడేందుకు టీఆర్ఎస్ తో టీడీపీ ఒప్పందం కుదుర్చుకుందని, అందుకనే పార్టీ నేతలకు ఇన్నాళ్లు విధించిన కళ్లాలను విధిల్చిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అదికార పార్టీలోకి వలస వెళ్తున్నారన్న వార్తలు కూడా తెరపైకి వస్తున్నాయి. ప్రజల్లో తమ పార్టీ ఇమేజ్ డామేజ్ కాకూడదనే వలస వెళ్లిన ఎమ్మెల్యేలను విమర్శిస్తున్నారన్న టాక్ కూడా వినబడుతుంది. ఏది నిజమో, ఏదీ అబద్దమో ఓటరు వేసిన ఓటరన్నకు మాత్రం అంతచిక్కక అన్ని పరిణామాలను అసక్తిగా తిలకిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles