with errabelli and prakash goud, tdp strength reduces to 6

Telangana tdp mlas strength decreases to 6 from 15

errabelli dayakar rao, prakash goud, tdplp floor leader, tdp leaders, telangana tdp, trs, telangana tdp strength, telangana tdp mlas, chandrababu naidu, nara lokesh, revanth reddy, chandrashekar rao, harish rao,

With telangana tdplp floor leader errabelli dayakar rao and rajendra nagar mla prakash goud quit, tdp party strength reduces to 6.

గెలిచింది 15 మంది.. ఇప్పటికి మిగిలింది 6గురే.. మరి ఇక ముందు...

Posted: 02/11/2016 10:50 AM IST
Telangana tdp mlas strength decreases to 6 from 15

తెలంగాణ టీడీపీకి బీటాలు వారింది. గత అసెంబ్లీ ఎన్నికలలో 15 స్థానాలను గెలిచిన టీడీపీ తాజా బలం మాత్రం కేవలం ఆరు స్థానాలకే పరిమితం అయ్యింది. శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా  రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ బలం మరింతగా తగ్గిపోయింది. దీంతో త్వరలోనే తెలంగాణ టీడీపీని తెరాసలో విలీనం చేసేందుకు లేఖ కూడా రాస్తామని టీఆర్ఎస్ లో చేరిన తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
 
శాసనసభాపక్ష నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సహా  రాజేంద్రనగర్ టీడీపీ ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరడంతో టీడీపీ బలం మరింతగా తగ్గిపోయింది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణలో టీడీపీ 15 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. వివేక్, ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్‌లతో కలిపి ఇప్పటికి 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్‌లో చేరారు. మిగిలిన ఆరుగురిలో ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య వున్నా.. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచే టీడీపీకి దూరంగా ఉంటున్నారు. ఆయనను మినహాయిస్తే.. ఇక మిగిలింది ఐదుగురు ఎమ్మెల్యేలే. వారు మహబూబ్‌నగర్ నుంచి రేవంత్‌రెడ్డి (కొడంగల్), ఎస్.రాజేందర్‌రెడ్డి (నారాయణ్‌పేట), హైదరాబాద్ నుంచి మాగంటి గోపీనాథ్ (జూబ్లీహిల్స్), అరికెపూడి గాంధీ (శేరిలింగంపల్లి), ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గానికి చెందిన సండ్ర వెంకట వీరయ్య (సత్తుపల్లి). అయితే సండ్ర వెంకట వీరయ్య, రేవంత్ రెడ్డీలపై ఓటుకు నోటు కేసు నమోదైన విషయం తెలిసిందే.
 
టీఆర్‌ఎస్‌లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు

 1. తలసాని శ్రీనివాస్‌యాదవ్    సనత్‌నగర్
 2. చల్లా ధర్మారెడ్డి    పరకాల
 3. తీగల కృష్ణారెడ్డి    మహేశ్వరం
 4. మాధవరం కృష్ణారావు    కూకట్‌పల్లి
 5. మంచిరెడ్డి కిషన్‌రెడ్డి    ఇబ్రహీంపట్నం
 6. జి.సాయన్న    కంటోన్మెంట్
 7. కేపీ వివేకానంద    కుత్బుల్లాపూర్
 8. ఎర్రబెల్లి దయాకర్‌రావు    పాలకుర్తి
 9. ప్రకాశ్ గౌడ్    రాజేంద్రనగర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles