telangana government plans huge hike of mla, mlc salaries

Telangana to compete with delhi in hiking mla salaries

telangana government, huge hike of salaries, mla's salaries, mlc salaries, cabinet rank salaries, delhi mla salaries, salaries hike to mla, mlc, cm kcr, telangana cm kcr, aravind kejriwal, assembly secretary, raja sadaram

Telangana government proposing to hike salaries of legislative assembly, council members to two three times.

ఢిల్లీతో పోటీ పడనున్న తెలంగాణ.. సీఎం కేసీఆర్ దే తుది నిర్ణయం..

Posted: 02/10/2016 10:13 AM IST
Telangana to compete with delhi in hiking mla salaries

దేశరాజదాని డిల్లీతో దేశ 29వ రాష్ట్రంగా నూతనంగా అవిర్బవించిన తెలంగాణ పోటీ పడాలని బావిస్తుంది. అయితే అది అభివృద్దిలోనా..? లేక మరెందులోనూ అన్న సందేమం అందరిలోనూ కలగకమానదు. కానీ అభివృద్ది, అవినీతి నిర్మూలన, ఇత్యాదులలో కాకుండా ఢిల్లీ ఎమ్మెల్యేలు పోందుతున్న జీతబెత్యాలతో తెలంగాణ ప్రబుత్వం కూడా పోటీ పడాలని బావిస్తుంది. అంటే మన శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతభత్యాలను కూడా అమాంతం రెండు, మూడింతల మేర పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది.

పెరిగిన ఖర్చులకు అనుగుణంగా తమ జీతాలు పెంచాలని పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌కు, అసెంబ్లీ కార్యదర్శి రాజా సదారాంకు వినతిపత్రాలు సమర్పించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి సారించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేల జీతాలు పెంచిన నేపథ్యంలో తెలంగాణలో కూడా జీతాలు సవరించాలనే అంశంపై ప్రభుత్వం చర్చించింది. ప్రస్తుతం మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్, విప్‌లు, ప్రతిపక్ష నాయకులు కేబినెట్ ర్యాంక్ జీతం పొందుతున్నారు. మిగతా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నెలకు రూ.95 వేల చొప్పున వేతనం తీసుకుంటున్నారు. వీటన్నింటికీ కలిపి ప్రభుత్వం ఏటా రూ.14.94 కోట్లు చెల్లిస్తోంది.
 
అయితే పెరిగిన ఖర్చుల నేపథ్యంలో వారికి నెల జీతాలు రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. సీఎం సమక్షంలో జరిగిన చర్చలో ఎమ్మెల్యేల ఖర్చులు ప్రస్తావనకు వచ్చాయి. ఇటీవల ఢిల్లీ శాసన సభ్యులకు రూ.4 లక్షల వరకు వేతనం ఇవ్వాలని అక్కడి అసెంబ్లీ ప్రతిపాదించిన విషయం కూడా చర్చకు వచ్చింది. వివిధ రాష్ట్రాల అసెంబ్లీ సభ్యులకు చెల్లిస్తున్న జీతభత్యాల వివరాలు తీసుకున్నారు. అన్నీ చర్చించిన తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాలు పెంచాలని, అదే నిష్పత్తిలో కేబినెట్ ర్యాంకున్న చట్ట సభల సభ్యుల జీతాలు పెంచే అంశంపైనా కసరత్తు జరిపారు. ఈ నేపథ్యంలో ఏ మేరకు పెంపును సమర్దిస్తూ తుది నిర్ణయం తీసుకుంటారన్నది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పైనే అధారపడి వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles