ISI supports LeT, JeM and Hizbul, David Headley tells court

Paks isi funds terror group lashkar says david headley

Mumbai attacks, Terrorist David Headley, Headley trial Mumbai, ISI Lashkar, David Headley, Headley deposition, Mumbai terror attacks, 26/11 terror attacks case

David Headley, who had entered into a plea bargain, told a Mumbai court that two unsuccessful bids were made by terrorist against Mumbai before the 26/11 strike

ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఐఎస్ఐ, ఆర్మీ సహకారం ఉంది..

Posted: 02/09/2016 06:54 PM IST
Paks isi funds terror group lashkar says david headley

భారతదేశంలో విద్వంసం సృష్టించే ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ నిదులు, నైతిక ధైర్యంతో పాటు మద్దతు కూడా అందించిందని ప్రస్తుతం అప్రూవల్ గా మారిన 26/11 దాడుల సూత్రధారి, ఉగ్రవాది డేవిడ్ హెడ్లీ చెప్పాడు. లష్కరే తోయిబా, జైషే మహ్మమద్, హిజ్ బుల్ ఉగ్రవాద సంస్థలకు నిదులు సమీకరించడం నుంచి అన్ని రకాలుగా పాకిస్తాన్ ఆర్మీ, పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ సహాయసమకారాలు అందిస్తుందని చెప్పారు. ముంబై ఉగ్రదాడుల కేసులో అప్రూవర్‌గా మారిన హెడ్లీ.. వీడియోలింకు ద్వారా గుర్తుతెలియని ప్రదేశం నుంచి ముంబై ప్రత్యేక కోర్టు విచారణలో పాల్గొన్నాడు.

అల్ కాయిదా గురించి తనకు తెలుసని, అది ఒక ఉగ్రవాద సంస్థ అని హెడ్లీ అంగీకరించాడు. అలాగే, లష్కరే తాయిబాకు జకీవుర్ రెహ్మాన్ ఆపరేషనల్ కమాండర్ అని కూడా అంగీకరించాడు. లష్కరే తాయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ అన్నీ యునైటెడ్ జీహాద్ కౌన్సిల్‌ కింద పనిచేస్తున్నాయని, ఇవన్నీ భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లో పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలేనని హెడ్లీ అంగీకరించాడు. 2007 నవంబర్ - డిసెంబర్ నెలల్లో పాకిస్థాన్‌లోని ముజఫరాబాద్‌లో ఓ సమావేశం జరిగిందని, దానికి సాజిద్ మీర్, అబు ఖఫా, తాను హాజరయ్యామని హెడ్లీ చెప్పాడు.

ఆ సమావేశంలోనే ముంబైలోని తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్ వద్ద రెక్కీ చేయాల్సిందిగా తనకు బాధ్యతలు అప్పగించారన్నాడు. తాజ్‌మహల్ ప్యాలెస్ హోటల్లో కొంతమంది రక్షణ శాస్త్రవేత్తలు సమావేశం అవుతున్నారన్న సమాచారం అప్పటికే లష్కర్ వద్ద ఉందని, సరిగ్గా ఆ సమావేశం జరిగే సమయానికి దాడి చేయాలని వాళ్లు అనుకున్నారని హెడ్లీ చెప్పాడు. తాను తొలిసారి జకీవుర్ రెమ్మాన్ లఖ్వీని 2003లో ముజఫరాబాద్‌లో లష్కర్ ప్రధాన కార్యాలయంలో కలిశానని హెడ్లీ తెలిపాడు. కాగా, అదే సమయంలో లఖ్వీ ఫొటో చూపించగా.. అతడేనని గుర్తుపట్టాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles