TRS party bags 99 seats in the GHMC Elections

Trs party bags 99 seats in the ghmc elections

GHMC, TRS, GHME Elections

TRS Party extreme victory in GHMC and create new record as single largest party in GHMC

టీఆర్ఎస్ 99.. కారు దెబ్బకు ప్రతిపక్షాల గగ్గోలు

Posted: 02/06/2016 08:17 AM IST
Trs party bags 99 seats in the ghmc elections

అధికార టీఆర్ఎస్ పార్టీ….గ్రేటర్ పీఠం మాదేనంటు ధీమా వ్యక్తం చేస్తూ వచ్చిందే నిజమైంది. 99 సీట్లు టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంది. ఎంఐఎం 44 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 4, కాంగ్రెస్ 2, టీడీపీ 1 స్థానాల్లో గెలుపొందాయి. ఎంఐఎంతో సంబంధం లేకుండానే అధికారంలోకి వస్తామనుకున్న టీఆర్ఎస్ కల నెరవేరింది. దీంతో ఎంఐఎం దోస్తానా లేకుండా బల్దియాపై గులాబీ జెండా ఎగరనుంది. సీమాంధ్ర ప్రాంత వాసులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో టీఆర్ఎస్‌కే ఫలితాలు అనుకూలంగా వచ్చాయి. బస్తీ వాసుల తీర్పు కూడా టీఆర్ఎస్ వైపే అని తేలింది.

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్‌ఎంసీ) ఎన్నికల్లో టీఆర్‌ఎస్ ప్రభంజనం సృష్టించింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల చరిత్రను తిరగరాసింది. మూడింట రెండొంతుల సీట్లు సాధించి విజయకేతనం ఎగురవేసింది. 2009లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తగిన సంస్థాగత బలం లేదని పోటీ నుంచి తప్పుకున్న టీఆర్‌ఎస్ ఈసారి ఏకంగా 99 డివిజన్లలో విజయఢంకా మోగించి రికార్డు సృష్టించింది.

పార్టీలు పోటీ చేసిన, గెలిచిన స్థానాలు..
పార్టీ పోటీ గెలుపు
టీఆర్‌ఎస్ 150 99
ఎంఐఎం 60 44
బీజేపీ 66 4
కాంగ్రెస్ 149 2
టీడీపీ 95 1
బీఎస్పీ 55 0
సీపీఐ 21 0
సీపీఎం 22 0
లోక్‌సత్తా 26 0
రిజిస్టర్డ్ పార్టీలు 49 0
స్వతంత్రులు 640 0

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : GHMC  TRS  GHME Elections  

Other Articles