KCR promises to treat all people in Hyderabad equally

Kcr promises to treat all people in hyderabad equally

TRS, Hyderabad, KCR, KCR about Hyderabad people

Thanking people of Hyderabad for giving historic mandate to TRS in the municipal elections, Telangana Chief Minister K. Chandrasekhar Rao on Friday promised that the government will treat all the people living in the city equally. With the ruling Telangana Rashtra Samithi (TRS) set to win over 100 seats in 150-member Greater Hyderabad Municipal Corporation (GHMC), the chief minister said all those living in Hyderabad are children of Hyderabad.

కేసీఆర్ వరాల జల్లు

Posted: 02/06/2016 09:24 AM IST
Kcr promises to treat all people in hyderabad equally

బల్దియా ఎన్నికల్లో గ్రేటర్ ప్రజలు టీఆర్ఎస్ కు చరిత్ర తిరగరాసే విధంగా తీర్పు ఇచ్చారన్నారు సీఎం కేసీఆర్. అయితే ఈ గెలుపును అంత తేలికగా తీసుకోకుండా.... ఎంత గొప్ప విజయమిచ్చారో...అంత గొప్పగా సేవ చేయాలన్నారు. పేద ప్రజలు ప్రధానం కోరుకుంటుంది డబల్ బెడ్ రూమ్ ప్లాట్స్ ఇవి త్వరలోనే అందిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి... రాబోయే బడ్జెట్ లో ఒక్క నగరంలోనే లక్ష ఇంట్లు కోసం బడ్జెట్ కేటాయిస్తామని తెలిపారు. దీంతో పాటు పార్టీ ఏదైతే మెనిఫేస్టోలో పెట్టిందో..ఆ హామీలన్ని నెరవేరుస్తామని తెలిపారు.ఇప్పడికే సార్వత్రిక ఎన్నికలల్లో ఇచ్చిన హామీల్లో పీజీ టు కేజీ తప్ప మిగాతావన్ని ఇచ్చి మాట ప్రకారం పూర్తి చేశామన్నారు.

పేదల ఏ జెండానే మా ఏజెండా అన్న ఆయన...వారికోసం రాత్రిపగలు తేడాలేకుండా కృషి చేస్తామన్నారు. సెటిలర్స్ కూడా మాకే ఓటేశారన్న కేసీఆర్.... హైదరాబాదులో ఉన్న ఏ రాష్టం వారినైనా కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్నారు. ప్రతిపక్షాలు చేసిన విమర్శలు పట్టించుకోవద్దని చెప్పారు. మంచి నీళ్లు, కరెంట్ లాంటి సమస్యలు హైదరాబాదులో లేకుండా చూస్తా మన్నారు. అట్లాగే శాంతి భద్రత విషయంలో అసాంఘీక శక్తులపై ఉక్కు పాదం మొపుతామని తెలిపారు. నగరంలో మల్టీ లేయర్ ప్లై ఓవర్, మురుగు నీరు వ్యవస్ధపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ఆసుపత్రులు అంటే గాంధీ, ఉస్మానియా మత్రమే ఉన్నాయని...నగర పరిధిలో మరో మూడు ఆసుపత్రులు కట్టిస్తామని చెప్పారు. కింగ్ కోఠి ని1000 పడకల ఆసుపత్రిగా తీర్చి దిద్దుతామన్నారు. రాజేంద్ర నగర్, కుకట్ పల్లి, ఉప్పల్, చంద్రాని గుట్ట లో ఈ ఆసుపత్రులు నిర్మిస్తామని అన్నారు. అంతే కాకుండా కూరగాయల మార్కెట్, స్మశానవాటికలు, టాయిలెంట్స్ నిర్మాణాలు , కమ్యూటీ హాల్స్ చేపడుతామన్నారు. మొత్తానికి ట్రూలీ గ్లోబల్ హైదరాబాద్ గా తీర్చిదిద్దుతామని మాటిచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TRS  Hyderabad  KCR  KCR about Hyderabad people  

Other Articles