Chandrababu Naidu believes that person for IT development in AP

Chandrababu naidu believes that person for it development in ap

IT, AP, Chandrababu Naidu, JA Chowdary, IT Industry, Microsoft

Chandrababu Naidu believes that person for IT development in AP. Despite Chandrababu Naidu being the poster boy of IT development in Hyderabad, there is not much movement of the segment to AP due to infrastructural issues. But looks like Naidu is gearing up to take it head on. Naidu had appointed JA Chowdary as the IT adviser for the state government.

ఐటీ పరిశ్రమల కోసం అతడినే నమ్ముకున్న చంద్రబాబు

Posted: 12/29/2015 08:26 AM IST
Chandrababu naidu believes that person for it development in ap

ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు హైటెక్ బాబు అన్న పేరు ఉంది.. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు బెంగళూరు ముఖ్య కేంద్రంగా సాగిన ఐటి పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా మరోసారి ఓ కీలక వ్యక్తి సహాయంతో ఐటి అగ్ర సంస్థలను అవశేష ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రప్పించేందుకు ప్రయత్నాలు జోరుగా సాగిస్తున్నారు. ముందు నుండి కూడా టెక్నాలజీ మీద మక్కువ ఉన్న చంద్రబాబు నాయుడు ఐటీ పరిశ్రమలను ఏపికి రప్పించడంలో ఓ వ్యక్తిని బాగా నమ్ముకున్నారు. ఇంతకీ ఎవరా వ్యక్తి..? ఎందుకు అంత నమ్మకం తెలియాలంటే మొత్తం స్టోరీ చదవాల్సిందే.

ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ పరుగులు పెట్టింది. బెంగళూరు కేంద్రంగా సాగిన ఐటీ పరిశ్రమ.. తర్వాత తర్వాత హైదరాబాద్ కేంద్రగా సాగింది. అయితే ఐటీ ఇండస్ట్రీకి అండగా నిలిచిన చంద్రబాబు.. తాజాగా తమ రాష్ట్రంలో ఐటీ దిగ్గజ సంస్థలను ఆహ్వానం పలుకుతున్నారు. అయితే గతంలో ఐటీ పరిశ్రమను హైదరాబాద్ కు రప్పించడంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తినే తాజాగా ఏపి ఐటీ అడ్వైజర్ గా ప్రభుత్వం నియమించింది. గతంలో చంద్రబాబు నాయుడు బిల్ గేట్స్ ఇండియాలో మైక్రోపాఫ్ట్  క్యాంపస్ ను ఏర్సాటు చెయ్యడంలో జె.ఎ చౌదరి కూడా కీరోల్ ప్లే చేశాడు. అప్పుడు ఆయన సాష్ట్ వేర్ టెక్నాలజీ పార్స్క్ ఆఫ్ ఇండియా డైరెక్టర్ గా పనిచేశారు. ఎలక్షన్ లలో కూడా చంద్రబాబు నాయుడుకు వెన్నుదన్నుగా నిలిచి.. చంద్రబాబు విజయంలో పాలుపంచుకున్నారు. అయితే తాజాగా మరోసారి ఆయనను ఐటీ అడ్వైజర్ గా నియమించడంతో.. ఐటీ పరిశ్రమ ఏపిలో బలపడుతుందని చంద్రబాబు నమ్మకంగా ఉన్నారు. ఆ దిశగా అడుగులు కూడా పడుతున్నట్లే కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IT  AP  Chandrababu Naidu  JA Chowdary  IT Industry  Microsoft  

Other Articles