MAS pilot praised for questioning Auckland-KL flight plan change

Malaysia airlines pilot queries flight path

Malaysia Airlines pilot queries flight pathauckland kl, flight plans, malaysia airlines, malaysian airlines, flight wrong direction, air traffic control, auckland, australia, kuala lumpur, ATC,

Malaysia Airlines (MAB) is investigating the flight plan submission for MH132 from Auckland to Kuala Lumpur on Christmas day after two different flight routes were issued to the flight and Auckland's Air Traffic Control (ATC)

ఆ విమాన ప్రయాణికులకు.. నిజం తెలసి నిశ్చేష్టులైయ్యారు

Posted: 12/28/2015 06:31 PM IST
Malaysia airlines pilot queries flight path

రోడ్డు మీద కారులో ప్రయాణించేప్పుడు సరైన దారిలోనే వెళ్తున్నామా..? లేదా..? అని ఇంతకుముందు దారిలో ఎవరైనా కనబడితే చాలునని వారిని అడ్రస్ అడిగి వెళ్తుంటాం. కానీ సాంకేతికత పరిపూరణంగా అభివృద్దిలోకి వచ్చన ఈ రోజుల్లో జీఆర్ఎస్ సిస్టమ్ సాయంతో వెళ్తున్నాం. అయితే భూ ఉపరితల ప్రయాణం చేసే.. విమానాలైతే.. వాటికి అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా కచ్చితంగా వెళ్తాయి. కానీ, మలేషియన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం న్యూజిలాండ్ నుంచి బయల్దేరి, దాదాపు గంట పాటు తప్పుడు దిశలో వెళ్లిపోయింది!

ఎంహెచ్132 అనే ఈ విమానం ఆక్లండ్ నుంచి కౌలాలంపూర్ వెళ్లాలి. అందుకు ఆస్ట్రేలియా మీదుగా వాయవ్య దిశలో నేరుగా వెళ్లాలి. కానీ, రాడార్ డేటాను బట్టి చూస్తే.. అది దక్షిణ దిశగా దాదాపు గంటపాటు ప్రయాణించినట్లు తేలింది. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన పైలట్లు.. ఆక్లండ్ ఓషియానిక్ కంట్రోల్ సెంటర్‌లోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వాళ్లతో చర్చించి.. ఆ తరువాత విమానాయ ప్రయాణామార్గాన్ని మార్చుకుని కౌలాలంపూర్ కు చేరుకుంది. ఇంత జరిగినా, ప్రయాణికులకు మాత్రం విషయాన్ని చెప్పకుండా, వారిని ఎలాంటి కంగారు, అభద్రతా బావానికి లోనుకాకుండా చేశారు పైలెట్ అయితే ఈ విషయం ఆలస్యంగా నిజాన్ని మీడియా ద్వారా తెలుసుకున్న ప్రయాణికులకు మాత్రం నిశ్చేష్టులయ్యారు.

విమానం ఇలా వెళ్లడం వల్ల దానికి ప్రమాదం ఏమీ రాలేదుగానీ, అసలు సాధారణంగా వెళ్లాల్సిన మార్గాన్ని ఎందుకు మార్చారనే దానిపై విచారణ జరుపిన అధికారులు..  స్తానికి ఎయిర్ ట్రాపిక్ కంట్రోల్ కు తప్పుడు మ్యాప్ ఇవ్వడంతోనే ఇదంతా జరిగిందని తెలుసుకుని.. ఏలాంటి ప్రమాదానికి గురికాకుండా వచ్చినందుకు సంతోషిస్తున్నారు. అయితే విమాన మార్గంలో తప్పును గ్రహించి.. ఏటీసీ అధికారులతో చర్చించి విమానాన్ని సక్రమ మార్గంలో నడిపించిన పైలెట్ పై ప్రశంసల జల్లు కురుస్తుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : malaysian airlines  flight  wrong direction  atc  auckland  australia  kuala lumpur  

Other Articles