Gossips on Chandrababu and KCR meeting

Gossips on chandrababu and kcr meeting

chandrababu naidu, KCR, telangana, AP, Ambati Rambabu, Madhu Yashki Goud, KCR with Chandrababu Naidu

Political Gossips went viral on AP cm Chandrababu Naidu and Telangana cm KCR. Chandrababu naidu begs for excuse him from cash for vote case.

చంద్రబాబు, కేసీఆర్ కలయిక మీద ఇన్ని పుకార్లా..?

Posted: 12/15/2015 09:06 AM IST
Gossips on chandrababu and kcr meeting

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడును ఆయత ఛండీయాగానికి ఆహ్వానించడానికి తెలంగాణ సిఎం కేసీఆర్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లారు. హైదరాబాద్ నుండి బయలుదేరిన కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రిక అందించి తర్వాత నాయుడు ఇంట్లో భోజనం చేసుకొని... వెంటనే హైదరాబాద్ కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే కేసీఆర్, చంద్రబాబు నాయుడు కలయిక మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబందాలు నెలకొనడానికి ఇది శుభపరిణామం అని మామూలు ప్రజలు అనుకుంటున్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వేరే విధంగా దీన్ని చెబుతున్నారు. వాళ్ల రాజకీయ పరిభాషలో వీరిద్దరి మీటింగ్ ఏంటో చూడండి...

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ సిఎం కేసీఆర్ కాళ్లు పట్టుకున్నారట. ఆయత ఛండీయాగం ఆహ్వాన పత్రికను అందించడానికి వచ్చిన కేసీఆర్ కాళ్లు చంద్రబాబు నాయుడు ఎందుకు పట్టుకున్నారు అంటే అంబటి రాంబాబు ఓ కారణం కూడా చెబుతున్నారు. ఓటుకు నోటు కేసులో తనను మినహాయించాలని కేసీఆర్ తో ప్రాధేయపడ్డట్లు చెబుతున్నారు. ఇక కేసీఆర్ ఎందుకు ఆంద్రకు వెళ్లారో మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెల్లడమే కాకుండా అక్కడ రొయ్యలు తినిరావడానికి కారణం.. వస్తున్న జిహెచ్ఎంసీ ఎన్నికలు అట. అవును సీమాంధ్రుల ఓట్ల కోసం కేసీఆర్ చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్లినట్లు చెబుతున్నారు. మొత్తానికి రాజకీయ బాష్యం ఒక్కోలా లేనిపోని అనుమానాలకు తావిస్తోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  KCR  telangana  AP  Ambati Rambabu  Madhu Yashki Goud  KCR with Chandrababu Naidu  

Other Articles