ampute athlete oscar pistorious convicted of murdering his girl friend

Oscar pistorius verdict changed to murder

Oscar Pistorius, South African, Reeva Steenkamp convict , murder , amputeathlete, Pistorius girlfriend Reeva Steenkamp, Pistorius shooted her four times, South Africa

Olympic athlete Oscar Pistorius has been found guilty of murder after a South African appeals court overturned an earlier manslaughter verdict.

ఆ క్రీడాకారుడు తన గర్ల్ ఫ్రెండ్ హత్యకేసులో దోషే..!

Posted: 12/03/2015 05:00 PM IST
Oscar pistorius verdict changed to murder

బ్లేడ్ రన్నర్ ఆస్కార్ పిస్టోరియస్ను దక్షిణాఫ్రికా సుప్రీంకోర్టులో మరోమారు చుక్కెదురైంది.  తన గర్ల్ ఫ్రెండ్ను హత్య కేసులో నిందితుడిగా అభియోగాలను ఎదుర్కొంటున్న పిస్టోరియన్ ను దక్షిణాప్రికా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దోషిగా తేల్చింది. పిస్టోరియస్కు సంబంధించిన కేసుపై వచ్చిన అప్పీల్పై అక్కడి సుప్రీంకోర్టు గురువారం నాడు విచారణ జరిపింది. అయితే గతంలో ఇచ్చిన తీర్పు చాలా తక్కువ తీవ్రత కలిగి ఉండటంతో ఈ కేసుపై పరిస్థితులు మరింత కఠినతరం అయ్యాయి. హౌస్ అరెస్ట్ కింద శిక్ష కాలాన్ని పూర్తి చేయడానికి స్థానిక కోర్టు తీర్పు ఇవ్వడంతో నిందితుడికి తగిన శిక్ష విధించాలంటూ నిరసనలు వెల్లువెత్తిన విషయం అందరికీ విదితమే.

దక్షిణాఫ్రికా జడ్జి తొకొజైల్ మసిపా బ్లేడ్ రన్నర్ పిస్టోరియస్కు గతంలో ఐదు సంవత్సరాల జైలుశిక్ష విధించారు. ఉద్దేశపూర్వకంగా దుర్బుద్ధితోనే గర్ల్ ఫ్రెండ్ను హత్యచేశాడని జడ్జి జస్టీస్ ఎరిక్ లీచ్ మీడియాకు తెలిపారు. ఈ కేసును విచారించిన ఉన్నత న్యాయస్థానం పిస్టోరియస్ను దోషిగా తేల్చుతూ తగిన శిక్ష విధించాలని ట్రయల్ కోర్టుకు కేసును తిప్పిపంపింది. పిస్టోరియస్ 2013లో ఫిబ్రవరి 14 తేదిన ప్రిటోరియాలోని తన నివాసంలో తన గర్ల్ ఫ్రెండ్ రీవా స్టీన్‌క్యాంప్‌ను దారుణంగా కాల్చి చంపినట్లు అభియోగాలతో అతనిపై హత్యకేసు నమోదైన విషయం తెలిసిందే. కాగా అంతకుముందు తలుపు గుండా నాలుగు రౌండ్లు కాల్పులు కూడా జరిపాడని నిర్థారించిన న్యాయస్థానం అతడిని దోషిగా పరిగణించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oscar Pistorius  South African  Reeva Steenkamp  murder  

Other Articles