national party offers revanth reddy chief ministry post if comes to power

Revanth reddy got bumper offfer from national party

Revanth Reddy, Telangana TDP leader, kondangal, BJP, Hansraj Gangaram, union minister Hansraj Gangaram, Telangana CM candidate, warangal by polls, revanth reddy bumper offfer, revanth reddy bumper offfer national party

bharatiya janata party leader and union minister Hansraj Gangaram offers revanth reddy chief ministry post if comes to power

.జాతీయ పార్టీ బంఫర్ ఆఫర్ చేజార్చుకున్న రేవంత్ రెడ్డి..!

Posted: 11/27/2015 05:28 PM IST
Revanth reddy got bumper offfer from national party

రేవంత్‌ రెడ్డి తెలంగాణలో మంచి వాగ్ధాటి కలిగిన నేతగా, అంశానికి కట్టుబడి మాట్లాడటంతో దిట్టగా మంచి పేరుంది. అయితే రాజకీయాల్లో అవి వుంటే సరిపోవు. దానికి కొంచెం మాస్ ఫాలోయింగ్ కూడా వుడాలి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి జైలుకు వెళ్లడంతో ఆయనపై ప్రజల్లో సానుభూతి ఏర్పడింది. ఇక బెయిల్ పై బయటకు వచ్చిన తరువాత చేపట్టిన ర్యాలీలో ఆయన ప్రభుత్వాధినేతపై సవాళ్లు విసురుతూ.. చేసిన ప్రసంగాలతో ఆయన కు మాస్ ఫాలోయింగ్ కూడా ఏర్పడింది. దీంతో తెలంగాణలో ప్రస్తతానికి తమ పార్టీ పుంజుకోవాలంటే ఇలాంటి నాయకుడు అవసరం వవుందనుకున్నారో ఏమో తెలియదు కానీ.. ఏకంగా ఓక జాతీయ పార్టీకి చెందిన కేంద్ర మంత్రి ఆయనకు బంఫర్ ఆఫర్ ప్రకటించారు.

ఏదా జాతీయ పార్టీ, ఎవరా కేంద్ర మంత్రి అనుకుంటున్నారా..? అక్కడికే వస్తున్నాం. తెలంగాణలో తమ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పెంచుకని అధికార ఫీఠాన్ని అదిరోహించాలని యోచిస్తున్న బీజేపి యే ఈ ఆఫర్ ను రేవంత్ కు ఇచ్చింది. ఈ ప్రతిపాధన తీసుకోచ్చింది కూడా కేంద్ర మంత్రి హన్స్ రాజ్ గంగారామ్. మా పార్టీలో చేరండి అంటూ ఓ కేంద్ర మంత్రి రేవంత్‌కు ఆహ్వానం పలికారు. బీజేపీ తరఫున సీఎం అభ్యర్థిగా పని చేద్దురుగాని అని కూడా చెప్పారు. ఇటీవల వరంగల్ ఉప ఎన్నికల ప్రచార సందర్భంగా ఈ సంఘటన జరిగినట్టు తెలిసింది.

వరంగల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి రేవంత్ వెళ్లారు. అదే సమయంలో ప్రచారానికి కేంద్ర మంత్రి హన్సరాజ్ గంగారాం కూడా వచ్చారు. ఓ భారీ బహిరంగ సభలో రేవంత్ ప్రసంగించారు. రేవంత్ ప్రసంగం పూర్తయిన వెంటనే ఆయన వద్దకు వెళ్లి అభినందించారు. పనిలో పనిగా బీజేపీలో చేరండి... మీరు ముఖ్యమంత్రి అభ్యర్ధిగా పని చేద్దురు గాని అని ఆహ్వానం పలికారు. హన్సరాజ్ ఆహ్వానాన్ని రేవంత్ సున్నితంగా తిరస్కరించారు. తాను తెలుగుదేశం పార్టీలో సంతోషంగా ఉన్నానని చెప్పారు. బీజేపి తాను చూడని పార్టీ కాదని చెప్పుకొచ్చారు. బీజేపీలో చాలా కాలం పని చేశానని...ఆ పార్టీ గురించి బాగానే తెలుసునని కేంద్ర మంత్రికి రేవంత్ తేల్చి చెప్పారు. మొత్తం మీద రేవంత్ చేసిన ఒక్క ప్రసంగం ఆయనకు బీజేపీ నుంచి బహిరంగ ఆహ్వానం పలికేలా చేసింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  Telangana TDP leader  kondangal  BJP  Hansraj Gangaram  

Other Articles