IBPS New Notification out now

Ibps new notification out now

IBPS, Jobs in Banks, Banks Jobs, Jobs, Govt Jobs, New Job Notification, Vaccencies

The Institute of Banking Personnel Selection (IBPS) has invited applications from eligible candidates for filling up vacancies at the post of Specialist Officers (SO). The eligible candidates should apply online on or before December 10.

JOBS: విడుదలైన IBPS నోటిఫికేషన్

Posted: 11/25/2015 01:17 PM IST
Ibps new notification out now

ఐబీపిఎస్ ద్వారా వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఐబీపీఎస్‌ CWE-V ద్వారా స్పెష‌లిస్ట్ ఆఫీస‌ర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. జనవరిలో జరిగే పరీక్షకు వచ్చే నెల 10 తేదితో గడువు ముగుస్తోంది. పూర్తి వివరాలు మీ కోసం..

* ఐటీ ఆఫీస‌ర్లు - అర్హత‌: కంప్యూట‌ర్ సైన్స్ /కంప్యూట‌ర్ అప్లికేష‌న్స్‌/ఇన్ఫర్మేష‌న్ టెక్నాల‌జీ/ ఎల‌క్ట్రానిక్స్‌/ఎల‌క్ట్రానిక్స్ అండ్ టెలీ క‌మ్యూనికేష‌న్‌/ఎల‌క్ట్రానిక్స్ అండ్ క‌మ్యూనికేష‌న్‌/ఎల‌క్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్‌ల్లో ఎందులోనైనా బ్యాచిల‌ర్ డిగ్రీ లేదా మాస్టర్ డిగ్రీ ఉండాలి. ఏదైనా డిగ్రీ పూర్తిచేసి, డీవోఈఏసీసీ నుంచి బి లెవెల్ పాసైన‌వారు కూడా ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

* అగ్రిక‌ల్చర‌ల్ ఫీల్డ్ ఆఫీస‌ర్లు - అర్హత‌: అగ్రిక‌ల్చర‌ల్ విభాగంలో నాలుగేళ్ల బ్యాచిల‌ర్ డిగ్రీ (ఏజీబీఎస్సీ) లేదా హార్టిక‌ల్చర్‌/యానిమ‌ల్ హ‌జ్బెండ‌రీ/వెట‌ర్నరీ సైన్స్‌/డైరీ సైన్స్‌/అగ్రీ ఇంజినీరింగ్‌/ఫిష‌రీ సైన్స్‌/ఫిషీ క‌ల్చర్‌/ అగ్రీ మార్కెటింగ్ అండ్ కోప‌రేష‌న్‌/ కోప‌రేష‌న్ అండ్ బ్యాంకింగ్‌/అగ్రి ఫారెస్ట్రీ ఈ విభాగాల్లో ఎందులోనైనా బ్యాచిల‌ర్ డిగ్రీ ఉండాలి.

* రాజ‌భాష అధికారి - అర్హత‌: హిందీలో పీజీతోపాటు డిగ్రీ స్థాయిలో ఇంగ్లిష్ చ‌దివుండాలి. లేదా సంస్కృతంలో పీజీతోపాటు డిగ్రీలో ఇంగ్లిష్‌, హిందీ స‌బ్జెక్టులు చ‌దివుండాలి.

* లా ఆఫీస‌ర్‌ - అర్హత‌: లా విభాగంలో బ్యాచిల‌ర్ డిగ్రీ (ఎల్ఎల్‌బీ) చ‌దివిన‌వాళ్లు అర్హులు. బార్ కౌన్సిల్‌లో పేరు న‌మోదై ఉండాలి.

*  హెచ్ఆర్‌/ప‌ర్సన‌ల్ ఆఫీస‌ర్‌ - అర్హత‌: ప‌ర్సన‌ల్ మేనేజ్‌మెంట్‌/ఇండ‌స్ట్రియ‌ల్ రిలేష‌న్స్‌/హెచ్ఆర్‌డీ/సోష‌ల్ వ‌ర్క్‌/లేబ‌ర్ లా ఎందులోనైనా పీజీ లేదా పీజీ డిప్లొమా లేదా హెచ్ఆర్ స్పెష‌లైజేష‌న్‌తో ఎంబీఏ చ‌దివుండాలి.

* మార్కెటింగ్ ఆఫీస‌ర్‌ - అర్హత‌: మార్కెటింగ్ విభాగంలో స్పెష‌లైజేష‌న్‌తో ఎంబీఏ లేదా మార్కెటింగ్ స్పెష‌లైజేష‌న్‌గా రెండేళ్ల పీజీడీబీఏ/పీజీడీబీఎం కోర్సు పూర్తి చేయాలి.

వ‌యోప‌రిమితి: 20 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీల‌కు, ఓబీసీ, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వ‌యోప‌రిమితిలో స‌డ‌లింపులు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యుడీ అభ్యర్థుల‌కు 100రూపాయలు; మిగిలిన అభ్యర్థులకు 600 రూపాయలు
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌ ప్రక్రియ: నవంబరు 23 - డిసెంబ‌ర్ 10.
ప‌రీక్ష తేదీలు: 30, 31 జనవరి 2016
మరిన్ని వివరాలకై ఇక్కడ క్లిక్ చెయ్యండి http://ibps.sifyitest.com/cwesplnov15/

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IBPS  Jobs in Banks  Banks Jobs  Jobs  Govt Jobs  New Job Notification  Vaccencies  

Other Articles