fake garam masala racket busted in old city

Fake garam masala racket busted in hyderabad

fake garam masala racket, arrest, rajendra gupta, south zone police, business man Rajendra Gupta, Uttar pradesh, whole sale vendors, fake garam masale all two states

A business man Rajendra Gupta, from Uttar pradesh came down to hyderabad and started fake garam masala racket, southzone police today busted it, in old city, hyderabad.

కల్తీ మసాలా తయారు చేసి.. తెలుగు ప్రజలకు పరిచయం చేసి..

Posted: 11/18/2015 06:48 PM IST
Fake garam masala racket busted in hyderabad

ఇప్పటివరకూ కల్తీ పాలు, కల్తీ నూనె, నెయ్యి, డాల్టాలను చూసిన హైదరాబాదీలకు కల్తీ మసాలలను ఎలా తయారు చేయాలో.. పరిచయం చేసి.. కోట్ల రూపాయలను గడించి.. చివరకు కటకటాలపాయ్యాడు ఓ వ్యాపారి. ఉత్తర్ ప్రదేశ్ కు చెందిన రాజేందర్ గుప్తా అక్కడ రెండేళ్ల పాటు ఈ వ్యాపారం చేసి.. తన మకాం ను ఏకంగా హైదరాబాద్ కు మార్చాడు. ఇక్కడకోచ్చిన ఎనమిది మాసాలలోనే తన కల్తీ సామ్రాజ్యాన్ని ప్రారంభించాడు.  ఒకటి రెండు కాదు ఏకంగా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడాడు. పాపం పండటంతో చివరకు పోలీసులకు చిక్కి.. ఊచలు లెక్కపెడుతున్నాడు.

గసగసాలు మొదలు మిరియాలు, జీలకర్ర, వాము వరకూ ఏదీ వదలటం లేదు. పాతబస్తీ కేంద్రంగా నకిలీ మసాలాలు తయారు చేస్తున్న ఓ ముఠాను సౌత్ జోన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించి ఉత్తరప్రదేశ్కు సంబంధించి ముగ్గురు, హైదరాబాద్కు చెందిన 11మంది వ్యాపారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వారి వద్ద నుంచి పెద్ద ఎత్తున నకిలీ మసాలాలు స్వాధీనం చేసుకున్నారు.  నకిలీ మసాలాల తయారీకి ప్రమాదకరమైన కెమికల్స్, ఆయిల్స్, కలర్స్‌ను ఈ ముఠా వాడుతున్నట్లు సౌత్ జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపారు. బొప్పాయి గింజలతో మిరియాలు, గడ్డితో జీలకర్ర, వాము, సోంప్, బొంబాయి రవ్వతో గసగసాలు, నకిలీ ఆవాలను ఈ ముఠా తయారు చేస్తున్నట్లు చెప్పారు.

హుస్సేని అలం పోలీస్‌ స్టేషన్‌  పరిధిలోని చంద్రికాపురంలో మూడు గోడౌన్లలో తయారు చేయడం.. బస్తాల్లో వాటిని నింపి బేగంబజార్ తో పాటు రాష్టంలోని వివిధ జిల్లాలకు బస్తాల్లో గుట్టుచప్పుడు కాకుండా సరఫరా చేస్తున్నట్లు డీజీపీ వెల్లడించారు.  40 లక్షల విలువైన కల్తీ మసాలాను స్వాధీనం చేసుకున్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన వ్యాపారి రాజేంద్ర గుప్తాతో పాటు బేగం బజార్‌లోని 11మంది  వ్యాపారులను అదుపులోకి తీసుకున్నారు. చిరువ్యాపారి కల్తీని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో సెంట్రల్‌జోన టాస్క్‌ఫోర్స్‌ అధికారులు రంగప్రవేశం చేశారు.

* గసగసాల్లో ఉప్మారవ్వ (బన్సీరవ్వ పెద్దరకం, బొంబాయిరవ్వ)ను గసగసాల్లా మార్చేందుకు పిండిమరలో వేస్తారు. కాస్త పలుకుగా మారగానే వాటిని గసగసాల్లో కలిపేస్తారు. తెల్లగా ఉండేందుకు పెయింట్ మిశ్రమాన్ని కలిపి ఆరబెడుతున్నారు.

* మిరియాలు గుండ్రంగా ఉండవు... బొప్పాయి విత్తనాలు గుండ్రంగా ఉంటాయి. వీటిని కలిపేందుకు బొప్పాయి విత్తనాలు ఎగుడుదిగుడుగా మారడానికి ముందుగా రెడ్ఆక్సైడ్ మిశ్రమంతో కలుపుతారు. వాటిని మిరియాలతో కలిపి కంకర మిషన్ తరహాలో యంత్రంలో వేసి కొంచెం బ్లాక్ ఆక్సైడ్‌ను కలుపుతారు. ఇదంతా అయ్యాక ఎండలో ఆరబెట్టి బస్తాల్లో ప్యాకింగ్ చేస్తారు.

* జీలకర్రను తక్కువ ధరకు దిగుమతి చేసుకోవడం, వాటిలో సోంపు కలుపుతారు. ఈ మిశ్రమం బాగా దగ్గరగా ఉండేందుకు మైదాపిండితో కలిపి పిండిమరలో ఒకసారి వేసి మళ్లీ కలిపేస్తారు. మరీ తెల్లగా ఉంటే కొంచెం నల్లగా మారేందుకు పెయింట్‌ను చిలకరిస్తారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fake garam masala racket  arrest  rajendra gupta  south zone police  

Other Articles