rajasthan government offers job to alwar school teacher imran khan

Rajasthan govt offers job to app developer praised by pm modi in uk

imran khan, modi imran khan, rajasthan government, app developer, imran khan apps, rajastan, pm narendra modi, rajasthan news, india news

Prime Minister Narendra Modi had mentioned him during his speech at Wembley in London on November 13 for his efforts in education sector.

ఆ ఖాన్ ఇంటికి నడిచోచ్చిన ఉద్యోగం.. ప్రధాని చలవే..!

Posted: 11/17/2015 08:31 PM IST
Rajasthan govt offers job to app developer praised by pm modi in uk

రాజు గారు తలచుకుంటే.. దొబ్బలకు కొదవా అని నానుడి. నిజమే దేశానికి రాజు స్థానంలో వున్న ప్రధాని నోటి నుంచి జాలువారిన పేరుకు అప్పటివరకు లేని మర్యాద, గౌరవం కూడా అలాగే దక్కుతుంటాయి. యూపీఏ తొలిసారి అధికారంలోకి వచ్చిన సందర్భంలో తన నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ పడుతున్న కష్టాలను పార్లమెంట్లు సమావేశాలలో కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ప్రస్తావించడంతో వారింటికి చకచకా అన్ని వసుతలు కలిగినట్లుగానే.. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ విదేశంలో ప్రస్తావించిన పేరు ఇమ్రాన్ ఖాన్ గురించి తెలియగానే అందరూ ఆయనను ప్రసన్నం చేసుకునేందుకు క్యూ కడుతున్నారు. మోదీ మెచ్చిన ప్రైమరీ స్కూల్ టీచర్ ఇమ్రాన్ ఖాన్ కు రాజస్థాన్ ప్రభుత్వం కూడా ఓ పెద్ద ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది.

యనకు శాస్త్ర సాంకేతికశాఖ విభాగంలో ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. అల్వార్ లోని ఓ ప్రాథమిక పాఠశాలలో సంస్కృతం మాష్టారుగా పనిచేస్తున్న ఇమ్రాన్ ఇప్పటి వరకు ఆయా విద్యార్థుల కోసం మొత్తం 52 యాప్ లు సృష్టించారు. వాస్తవానికి ఈ విషయం దేశానికి పెద్దగా పరిచయం లేకపోయినా మొన్న ప్రధాని నరేంద్రమోదీ బ్రిటన్ టూర్ కు వెళ్లినప్పుడు ఇమ్రాన్ పేరు ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యారు. మీడియా ఆయన ఇంటిముందు చేరి కొన్నిగంటల్లోనే హీరోనే చేసింది. దీంతో మంగళవారం రాజస్థాన్ శాస్త్ర సాంకేతిక శాఖలో ప్రాజెక్టు అధికారిగా ఉద్యోగాన్ని ఆఫర్ చేసి నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా ఓ 11 వేల రూపాయల చెక్ ను కూడా అందజేసింది. మరి ప్రధానమంత్రా మజకా..!
 
జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : imran khan  rajastan  pm narendra modi  

Other Articles