Modi to British parliament: 'India is new bright spot, we have 800 million people under 35 yrs'

World must speak in one voice against terrorism modi in uk parliament

PM Modi,Modi parliament speech,Modi UK visit,PM Modi UK Parliament,David Cameron,Modi in London,Narendra Modi,Prime Minister Modi

Prime Minister Narendra Modi on Thursday said India was the new bright spot of hope and opportunity as he referred to opportunities in sectors

ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యస్వరం వినిపించాలి

Posted: 11/13/2015 07:27 AM IST
World must speak in one voice against terrorism modi in uk parliament

ఉగ్రవాదానికి ఊతమిచ్చే వారిని వెలి వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. బ్రిటన్‌ పార్లమెంటులోని రాయల్‌ గ్యాలరీలో ఉభయ సభల ఎంపీలను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలన్నీ ఏకతాటికి రావాల్సిన అవశ్యకత వుందన్నారు. ప్రపంచ శాంతి కోసం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యస్వరాన్ని విన్పించాల్సిన అవసరం ఉందన్నారు. ఇరుదేశాల్లోని భవిష్యత్తు తరాలకు భరోసా ఇచ్చేందుకు భారత, బ్రిటన్‌ భద్రతాసంస్థలు కలిసి పనిచేయాలని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్రిటన్‌ పార్లమెంటు భవన సముదాయంతో ఆధునిక భారతదేశ చరిత్రకు విడదీయరాని బంధం ఉందన్నారు. ఆధునిక భారతదేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించిన నెహ్రూ నుంచి మన్మోహన్‌ వరకు ఎందరో బ్రిటన్‌ పార్లమెంటుతో అనుబంధాన్ని కలిగి ఉన్నారు’ అని మోదీ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడాన్ని గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు. పార్లమెంటు సమావేశాలు లేకున్నా తన కోసం రాయల్‌ కోర్టు ద్వారాలు తెరిచినందుకు కామన్స్‌ స్పీకర్‌ జాన్‌ బెర్కోవ్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు.
 
‘బ్రిటన్‌ పార్లమెంటు వద్ద గాంధీ విగ్రహం ఉండటం ఎలా సాధ్యమైందని ఒకరు తనను ప్రశ్నించారని అన్నారు. దానికి తాను సమాధానం ఇస్తూ.. గాంధీ గొప్పతనాన్ని గుర్తించడం ద్వారా బ్రిటీషర్లు తమ వివేకాన్ని చాటుకుంటే.. గాంధీని వారితో పంచుకోవడం ద్వారా భారతీయుల తమ ఔన్నత్యాన్ని వెల్లడించారని సమాధానం ఇచ్చానని మోదీ వివరించారు. ప్రపంచానికి భారత గొప్ప ఆశాకిరణంగా నిలుస్తోందని మోదీ పేర్కొన్నారు. భారత్ ను సందర్శించి మార్పులు గమనించవచ్చంటూ ఆహ్వానం పలికారు. గత ఎన్నికల సమయంలో తాను కెమెరాన్‌కు ఓ నినాదాన్ని ఇచ్చానన్నారు. ‘ఫిర్‌ ఏక్‌ బార్‌.. కెమెరాన్‌ సర్కార్‌’ అన్న నినాదంతో ఆయన ముందుకెళ్లి విజయం సాధించారు. దానికి తనకు రాయల్టీ ఇవ్వాల్సి ఉందని చలోక్తి విసిరి నవ్వుల పువ్వులు పూయించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Britain  London  PM Modi  ModiInUK  

Other Articles