human trafficking survivor teenage victim claims she was raped 43,200 times in Mexico | mexico prostitutions

Teenage victim claims she was raped 43200 times in mexico

mexico human trafficking, human trafficking cases, mexico girl raped 43,200 times, young girl raped 43,200 times, human trafficking, mexico crime news, mexico prostitutes

Teenage victim claims she was raped 43,200 times in Mexico : A young girl, who was lured from poverty in Mexico by a man who befriended her with sweets and a convertible car, has revealed how she was raped 43,200 times after falling victim to human trafficking.

ఆ యువతి 43,200సార్లు అత్యాచారానికి బలయ్యింది..

Posted: 11/12/2015 11:09 AM IST
Teenage victim claims she was raped 43200 times in mexico

మెక్సికోలో యువతుల్ని సెక్స్ బానిసలుగా అమ్మేయడం లాంటివి చాలా సర్వసాధారణం. అలాంటి దారుణమైన పరస్థితుల నుంచి ఎన్నోరకాలుగా ప్రయత్నించి చివరికి అనుకోకుండా బయటపడిన ఓ యువతి.. తాను అనుభవించిన బాధను ప్రపంచడానికి తెలియజేసింది. విలాసవంతమైన జీవితాన్ని కల్పిస్తామంటూ మభ్యపెట్టి వ్యభిచారం రొంపిలోకి లాగిన తనను.. 48,200 సార్లు అత్యాచారం చేశారంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది. నాలుగేళ్ల పాటు ప్రతిరోజూ కనీసం 30 మంది తనపై అత్యాచారం చేసేవాళ్లని.. ఇలా తాను దాదాపు 43,200 సార్లు అత్యాచారానికి గురయ్యానని ఆమె వెల్లడించింది. ఆ యువతి వెల్లడించిన ఆవేదనను చూసి.. ప్రపంచమంతా నివ్వెరపోయింది.

ఆ యువతి 12 ఏళ్ల వయసులో వున్నప్పుడు ఓ వ్యక్తి వచ్చి.. ఖరీదైన బహుమతులు, బోలెడంత డబ్బు, విలాసవంతమైన కార్లు ఇస్తానంటూ మభ్యపెట్టాడు. అతని మాటల్ని నమ్మి వెంట వెళ్లిన ఆ యువతిని మెక్సికోలోని టెనాన్సింగో అనే పట్టణానికి తరలించాడు. అది మనుషుల అక్రమ రవాణాకు ప్రధాన కేంద్రం. అక్కడికెళ్లిన తాను మూడు నెలలపాటు అక్కడే ఉన్నానని, ఆ తర్వాత తనను అక్కడి నుంచి మరో పెద్ద నగరానికి తరలించారని, అక్కడ బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దించారని తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ప్రతిరోజూ ఇదే పని అయ్యేదని రోధిస్తూ బాధను వెల్లడించింది. తనపై అత్యాచారం చేస్తున్నప్పుడు తాను ఏడుస్తుంటే.. వాళ్లు తనని చూసి నవ్వేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ సందర్భంలో ఓ విటుడు తన మెడమీద ముద్దుపెట్టినట్లు చూడటంతో తనను ఈ వృత్తిలోకి దించిన వ్యక్తి చైన్ తీసుకుని ఒళ్లంతా చీరేశాడని వాపోయింది. ఇస్త్రీ పెట్టెతో వాతలు కూడా పెట్టాడంటూ ఆ గాయాలు చూపించింది. నిత్యం అత్యాచారం బలవ్వడమే కాదు.. వేధింపులకు కూడా గురయ్యేదానినంటూ ఆమె తాను అనుభవించిన బాధను వివరించింది.

ఇదిలావుండగా.. కేవలం ఆ ఒక్క అమ్మయే కాదు.. మెక్సికోలో ప్రతియేటా కనీసం 20 వేల మంది అమ్మాయిలు ఇలాంటి పరిస్థితుల్లో మగ్గిపోతున్నారు. ఆమెను మెక్సికో నగరంలో నిర్వహించిన యాంటీ ట్రాఫికింగ్ ఆపరేషన్‌లో సంరక్షించారు. ఇప్పుడామె ఈ అక్రమరవాణాపై పోరాటంలో ముందంజలో ఉంది. ఈ దారుణాన్ని అణిచివేయాలంటూ పిలుపునిస్తోంది. ఈమెకు మద్దతుగా ఎంతోమంది మహిళలు, పురుషులు నిలిచారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mexico girl raped 43  200 times  mexico human trafficking  

Other Articles