Sujana Chowdary causes a stir with comments on reservations for women

Union minister sujana chowdary stirs controversy on reservations for women

Union Minister Sujana Chowdary, TDP senior leader Sujana Chowdary, sujana stirs controversy on reservations for women, Sujana against reservations for women, Union Minister, Sujana Chowdary, controversy comments, reservations for women

Union Minister and TDP senior leader Sujana Chowdary landed himself in a controversy over his comments against reservations for women.

మహిళా రిజర్వేషన్లపై కేంద్రమంత్రి సుజనా వివాదాస్పద వ్యాఖ్యాలు

Posted: 11/08/2015 06:54 PM IST
Union minister sujana chowdary stirs controversy on reservations for women

కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి, టీడీపీ సీనియర్ నేత సుజనా చౌదరి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా రిజర్వేషన్లకు తాను వ్యతిరేకమని ఆయన చేసిన ప్రకటనపై ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. విజయవాడలో క్రితం రోజు నిర్వహించిన కాన్ఫెడరేషన్ ఆఫ్ ఉమెన్ ఎంటర్ ప్రెన్యూర్స్ (సీవోడబ్ల్యూఈ)ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో మహిళా రిజర్వేషన్లకు వ్యక్తిగతంగా తాను వ్యతిరేకమని ప్రకటించారు.

అన్ని రంగాల్లో ముందున్న మహిళలకు రిజర్వేషన్లు అవసరం లేదన్నది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. వీళ్లు మహిళలు అని వారికి అలా స్టాంప్ వేసి కూర్చోబెట్టడం తప్పనేది తన అభిమఃతంగా చెప్పుకోచ్చారు. 360 డిగ్రీస్ లో పూర్తి స్థాయిలో మేనేజ్ మెంట్ అనేది ఇంపార్టెంట్. ఇంటర్నెట్, వాట్సప్ సాయంతో మహిళలు అన్ని రంగాల్లోనూ తమ ప్రతిభను చూపించుకుంటున్నారు. చుట్టుపక్కల వారి అవసరాలను గుర్తించి దానికి అనుగుణంగా పరిశ్రమలు నడిపితే ట్రాన్స్ పోర్టేషన్ ఖర్చు ఉండదు’’ అని మంత్రి సుదీర్ఘ ప్రసంగం చేశారు. మహిళా రిజర్వేషన్లకు తమ పార్టీ అనుకూలమేనని, తాను వ్యక్తిగతంగా మాత్రమే దీనిని వ్యతిరేకిస్తున్నానని మంత్రి పేర్కొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Union Minister  Sujana Chowdary  controversy comments  reservations for women  

Other Articles