Gold chain snatched from police officer

Gold chain snatched from police officer

chain snatch, Kolkata, Police, Gold chain

A woman assistant sub inspector of Kolkata Police has been robbed of her gold chain when she was returning home from duty, the police said today.

లేడీ పోలీస్ ‘చైన్’తో ఉడాయించిన స్నాచర్లు

Posted: 10/28/2015 01:05 PM IST
Gold chain snatched from police officer

రోజ రోజుకు చైన్ స్నాచింగ్ లు పెరుగుతున్నాయి. ఆడవాళ్ల చైన్ ల మీద కన్ను వేసిన కన్నింగ్ గాళ్లు... కనురెప్ప సమయంలో కన్నుగప్పి బంగారు గొలుసులతో ఉడాయిస్తున్నారు. తమ చైన్ లు కొట్టేశారు బాబూ అంటూ పోలీసులను ఆశ్రయించడం బాధితుల వంతవుతోంది. కానీ అదే పోలీసుల చైన్ లు కొట్టేస్తే ఎలా ఉంటుంది...? పోలీసుల చైన్ లే స్నాచింగ్ కు గురైతే పరిస్థితి ఏంటి..? ఇలా జరుగుతుంది అనుకుంటున్నారా..? కానీ జరిగింది. అచ్చంగా ఇలాగే జరిగింది ఏకంగా లేడీ పోలీస్ మెడలోని గొలుసునే కొట్టేశారు కన్నింగ్ గాళ్లు.కోల్ కతాలో జరిగిన ఈ ఘటన చోటుచేసుకోవడంతో వార్తల్లో నిలిచింది. పాపం పట్టుకోవాల్సిన పోలీసులే ఇలా చైన్ పగొట్టుకుంటే ఎవరికి చెప్పుకోవాలో మరి.

చైన్ స్నాచర్లు సామాన్య ప్రజలను వదిలిపెట్టి దొంగల అంతుచూసే పోలీసునే టార్గెట్‌గా చేసుకున్నారు. కోల్‌కతాలో మహిళా ఏఎస్‌ఐ నిర్మలారాయ్ విధులు నిర్వర్తించుకుని ఇంటికి తిరిగెళ్తున్న సమయంలో ఇద్దరు దుండగులు బైకుపై వచ్చారు. పిక్నిక్ గార్డెన్ సమీపంలో బైకుపై వచ్చి నిర్మలా మెడలో ఉన్న బంగారు గొలుసును లాక్కెళ్లారు. స్నాచింగ్ ను ఖచ్చితంగా స్థానికులే చేసి ఉంటారని నిర్మల తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామని వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chain snatch  Kolkata  Police  Gold chain  

Other Articles