A Medico attemp suicide in Kadapa

A medico attemp suicide in kadapa

Medic Suicide, Suicide, Saikrishna, Kadapa, RIMS, AP

A Medico attemp suicide in Kadapa. A MBBS student in Rajiv Gandhi Institute of Medical sciences, Kadapa, tried to suicide. He wrote a suicide letter, That he cant study the MBBS course.

ఎంబీబీఎస్ చదవలేక.. ఆత్మహత్యాయత్నం

Posted: 10/26/2015 12:46 PM IST
A medico attemp suicide in kadapa

మా వాడు మామూలు కాదు... డాక్టర్ అవుతాడు.. ఇంజనీర్ అవుతాడు అంటూ గొప్పగా చెప్పుకునే తల్లిదండ్రుల కోసం వారి పిల్లలు చదువులతో కుస్తీ పడుతున్నారు. చాలా మంది సక్సెస్ అవుతున్నా. కొంత మంది మాత్రం సక్సెస్ కాలేకపోతున్నారు. చాలా మంది చదువుల భారం తట్టుకోలేక తమ తనువు చాలిస్తున్నారు. చదువుల ఒత్తిడి తట్టుకోలేక..ఎంతో భవిష్యత్ ఉన్న విద్యా కుసుమాలు..మధ్యలోనే రాలిపోతున్నాయి. ఏపీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడప నగరంలోని రిమ్స్(రాజీవ్ గాంధీ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) వైద్యశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. సోమవారం ఉదయం ఎంబీబీఎస్ చదువుతున్న ఫస్టియర్ విద్యార్థి సాయికృష్ణ ..హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు.

సాయికృష్ణ ఆత్మహత్య్యత్నాన్ని గుర్తించిన తోటి విద్యార్థులు..అతడు బిగించుకున్న ఉరిని విప్పారు. ఆ వెంటనే రిమ్స్ లోని ఆస్పత్రికి తరలించారు. సూసైడ్ అటెంప్ట్ లో తీవ్రంగా గాయపడి సాయికృష్ణ ఆరోగ్యపరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా బాధితుడి గదిలో సూసైడ్ నోట్ లభించింది. చదువు ఒత్తిడి భరించలేకనే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా అందులో రాసి ఉంది. తాను శనివారం నాడే ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్టు అందులో పేర్కొన్నాడు. తల్లిదండ్రుల కోర్కె నెరవేర్చేందుకు ఎంబీబీఎస్ చదవాలని ఉన్నా.. తన వల్ల కావడం లేదని ఆ లేఖలో సాయికృష్ణ తమ మనోవేదనను వివరించాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు వెల్లడించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Medic Suicide  Suicide  Saikrishna  Kadapa  RIMS  AP  

Other Articles