Chandrababu naidu reject new assembly building

Chandrababu naidu reject the proposal to build new assembly building

Chandrababu Naidu, Kodela, AP, Assembly, GUntur, New assembly building, Kodela Shivaprasad

Chandrababu naidu reject the proposal to build new assembly building. AP CM Chandrababu Naidu decided to reduce the waste expendature. He rejected the new assembly construction.

కోడెల గారు.. వద్దండి అంటున్న చంద్రబాబు

Posted: 10/26/2015 12:32 PM IST
Chandrababu naidu reject the proposal to build new assembly building

ఏపి సిఎం నారా చంద్రబాబు నాయుడు పొదుపు బాట పట్టారు. ఇప్పటికే చాలా సార్లు దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో తాజాగా సర్దుబాటు చర్యలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది. విదేశీ పర్యటనల కోసం వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు నాయుడు రైతుల రుణ మాఫీకి మాత్రం ముందుకు రావడం లేదని అన్ని విపక్షాలు చంద్రబాబు నాయుడు మీద దుమ్మెత్తిపోశాయి. దాంతో గతంలో వచ్చిన విమర్శలకు మరోసారి అవకాశం ఇవ్వకూడదని అనుకుంటున్నట్లున్నారు అందుకే తాత్కాలిక అసెంబ్లీ నిర్మాణ ప్రతిపాదనను వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. త్వరలోనే శాశ్వత అసెంబ్లీ అందుబాటులోకి రానున్నందున తాత్కాలిక భవనాల పేరిట వృథా ఖర్చు ఎందుకంటూ స్పీకర్ కోడెల శివప్రసాద్ ప్రతిపాదనను చంద్రబాబు తిరస్కరించారు. ఈ మేరకు కొద్దిసేపటి క్రితం తనను కలిసిన స్పీకర్ తో చంద్రబాబు తాత్కాలిక భవన నిర్మాణాన్ని విరమించుకోవాలని సూచించారు.

ప్రస్తుతం తుళ్లూరు సమీపంలో ఉన్న హాయ్ ల్యాండ్ లో ఏపీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించుకునే విషయాన్ని పరిశీలించాలని చంద్రబాబు సూచించారు. సమావేశాల నిర్వహణ, సభ్యులకు వసతి తదితరాలకు హాయ్ ల్యాండ్ సరిగ్గా సరిపోతుందని కూడా చంద్రబాబు వ్యాఖ్యానించినట్లు సమాచారం. కేవలం రెండేళ్ల కాల పరిమితి కోసం తాత్కాలిక భవనాల నిర్మాణం అంటే, ప్రజా ధనం వృథా అయినట్లే కదా? అన్న ధోరణిలో చంద్రబాబు ఈ ప్రతిపాదనను తిరస్కరించినట్లు సమాచారం. మొత్తానికి చంద్రబాబు నాయుడు దుబారా ఖర్చుకు కళ్లెం వేస్తున్నట్లు కనిపిస్తోంది. చూడాలి మరి ఇది కేవలం అసెంబ్లీ నిర్మాణం అంశంలో మాత్రమేనా లేదా అన్ని అంశాల్లోనా అనేది చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chandrababu Naidu  Kodela  AP  Assembly  GUntur  New assembly building  Kodela Shivaprasad  

Other Articles