PM upset, Amit Shah summons BJP leaders, warns against making any further controversial remarks

Pm upset over bjp leaders beef remarks amit shah summons them

amit shah, bjp, PM Modi upset, dadri, beef ban, modi, modi beef ban, manohar lal khattar, politics, sakshi maharaj, sangeet som, mahesh sharma, dadri violence, india news

Shah's warning comes after PM Modi expressed his displeasure over the recent controversial remarks, warning that party leaders will have to do some amount of damage control.

ప్రధాని మోడీ అప్సెట్: ఆ నేతలకు క్లాస్.. సమన్లు

Posted: 10/18/2015 03:08 PM IST
Pm upset over bjp leaders beef remarks amit shah summons them

గోమాంసంపై బీజేపి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దిద్దుబాటు చర్యలను చేపట్టే బాధ్యతలను బిజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తన భుజాలపైకి ఎత్తుకున్నారు. మరీ ముఖ్యంగా బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపి నేతలు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా తమకు అనుకూలంగా వస్తాయనుకున్న ఫలితాలు ఎక్కడ తారుమారు అవుతాయోనని అందోళన చెందిన పార్టీ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది. గోమాంసంపై వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేసిన నేతలకు అదివారం అమిత్ షా తన కార్యలయంలో క్లాస్ తీసుకున్నారు.

ప్రధాన మంత్రి నరేంద్రమోడీ గారు తీవ్రంగా అప్ సెట్ అయ్యారు. ఆయన ఈ పరిస్థితికి మీరు చేసిన వ్యాఖ్యలే కారణం. మీరు చేసిన వ్యాఖ్యలు ఒక్క నరేంద్ర మోదీకేగాక, మొత్తం పార్టీకి చెడ్డపేరు తెచ్చాయి. ప్రధాని అభిప్రాయం వెల్లడించేటప్పుడు సమన్వయంతో వ్యవహరించాలని, ఆచి తూచి మాట్లాడాలని మీకు తెలియదా? ఇక ఏం చెప్పుకుంటారో చెప్పుకొండి. లిఖిత పూర్వక వివరణ ఇవ్వండి' అంటూ గోమాంసంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతలపై ఆ పార్టీ చీఫ్ అమిత్ షా ఫైర్ అయ్యారు.

ఈ మేరకు హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టార్, కేంద్ర మంత్రి మహేశ్ శర్మ, ఎంపీ సాక్షి మహారాజ్, యూపీ ఎమ్మెల్యే సంగీత్ సోమ్ లకు సమన్లు జారీచేశారు. ఈ ముగ్గురు నేతలను ఆదివారం ఉదయం తన కార్యాలయానికి పిలిపించుకున్న అమిత్ షా.. వివాదాస్పద వ్యాఖ్యలు ఎందుకు చెయ్యాల్సి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. వారి వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో చివరికి సమన్లు జారీచేశారు. బీఫ్ మానేస్తేనే ముస్లింలు భారత్ లో ఉండాలని హర్యానా సీఎం ఖట్టార్.. గోవధకు పాల్పడ్డవారిని ఉరితీయాలని ఎంపీ సాక్షి మహారాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇక ఎమ్మెల్యే సంగీత్ సోమ్.. దాద్రి ఘటనపై అనుచితన వ్యాఖ్యలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : beef coments  summons  bjp  amith shah  pm narendra modi  

Other Articles