gurgaon woman file dowry case against dead husband

Dowry charge slapped on dead man

Rakesh Pilania, Gurgaon locality, suicide out of fear, Section 498A IPC, dowry harassment case, Section 498A against his family, misuse of section 498A, Deepika Bhardwaj, misuses of the controversial penal section, Dowry,charge,slapped,dead,man,Wife,family,register,FIR,day,husband,killed,counter,abetment,suicide,charge

Dowry charge slapped on dead man: Wife and her family register FIR a day after her husband killed himself 'to counter abetment to suicide charge'

ఇలా కూడా చట్టాన్ని వాడుకునే వాళ్లుంటారు.. తస్మాత్ జాగ్రత్తా..!

Posted: 10/16/2015 10:07 PM IST
Dowry charge slapped on dead man

అత్తమామలను వేధింపులకు గురిచేసేందుకు, భర్త నుంచి సులభంగా విడాకులు తీసుకొని భరణం పొందేందుకు కొంత మంది మహిళలు భారతీయ శిక్షాస్మృతిలోని 498ఏ సెక్షన్‌ను దుర్వినియోగం చేస్తున్నారు. అదెలా అన్న విషయం తెలియాలంటటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. ఉత్తరప్రదేశ్‌లోని గురుగావ్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ, చట్టంలోని ఓ సెక్షన్ ఎక్కువే చదివినట్టున్నది... భర్త ఆత్మహత్య చేసుకొని చనిపోయిన మరుసటి రోజున భర్తతోపాటు, అత్తమామలపై వరకట్న వేధింపుల కేసును దాఖలు చేసింది.

బ్యాంకర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల రాకేశ్ పిలానియా అక్టోబర్ ఐదవ తేదీన తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఆ మరుసటి రోజే భార్య , భర్త, అత్తమామలపై డౌరీ కేసును దాఖలు చేసిందని 498ఏ సెక్షన్ దుర్వినియోగంపై డాక్యుమెంటరీ తీస్తున్న ఫిల్మ్‌మేకర్, జర్నలిస్ట్ దీపక్ భరద్వాజ్ తెలిపారు. ఈ కేసులో రాకేశ్ చనిపోయినందున ఆయన్ని కేసు నుంచి తప్పిస్తారని, అయితే బంధువులపై మాత్రం దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. భర్త ఆత్మహత్యకు కారకురాలిగా భావించి ఆమెను అరెస్టు చేయకుండా, కేసు పెట్టకుండా ఉండేందుకే ఆమె ఈ వరకట్నం కేసును దాఖలు చేసి ఉండవచ్చని భరద్వాజ్ అనుమానం వ్యక్తం చేశారు.

498ఏ సెక్షన్ దుర్వినియోగానికి ఇది మరో చక్కటి ఉదాహరణని ఆయన వ్యాఖ్యానించారు. ‘పది లక్షల రూపాయలు కావాలని వేధిస్తున్నట్టు కేసు పెడతానంటూ మమ్మల్ని, మా అబ్బాయిని కోడలు తరచుగా బెదిరించేది. ఆ బెదిరింపులు, వేధింపులను భరించలేకనే నా కుమారుడు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడు’ అని రాకేశ్ తండ్రి ఆనంద్ ప్రకాష్ పిలానియా మీడియాకు తెలిపారు. ఇదే విషయమై రాకేశ్ భార్యను కూడా మీడియా సంప్రదించగా మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dowry case  section 498A  gurgaon woman  Deepika Bhardwaj  

Other Articles