Supreme Court | 2014 amendment | Maharashtra police | banning dance performances | dance bars

Supreme court allows dance bars to operate in maharashtra

Supreme Court green signal to dance bars, supreme court allows dance bars, supreme court on dance bars, SC allows dance bars, SC allows maha dance bars, SC ammends maha police act, Maharashtra dance bars, SC sanctions dance bars, Indian dance bars, SC stays 2014 act, dance bars, supreme court, stay on dance bars ban

The Supreme Court on Thursday stayed a 2014 amendment of the Maharashtra police act banning dance performances in various places including bars in the state.

‘మహా’ మందుబాబులు.. వేయనున్నారు చిందులు.. కలిసోచ్చిన దసరా..

Posted: 10/15/2015 01:02 PM IST
Supreme court allows dance bars to operate in maharashtra

మహారాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. దసరా పర్వదినం సందర్బాన్ని అ వెనువెంటనే వచ్చే దీపావళి పర్యదినాన్ని మహారాష్ట్ర వాసులు అందులోనూ మహారాష్ట్రకు చెందిన మందుబాబులు మాత్రం మస్తుగా ఎంజాయ్ చేయనున్నారు. ఎందుకంటారా..? రాష్ట్ర ప్రభుత్వం మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో విధించిన డాన్సు బార్ల నిషేదంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు స్టే విధించింది. దాంతో డాన్స్ బార్లను తెరిపించేందుకు లైన్ క్లియరైంది. జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ప్రఫుల్లా సి పంత్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం ఈ మేరకు స్టే విధిస్తూ.. రాష్ట్రప్రభుత్వ నిషేధంపై స్టే విధించాడాన్ని సమర్థించుకుంది.

2005లో తొలిసారిగా డాన్స్ బార్లపై మహారాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించగా, 2013లో దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ -ఎన్సీపీ ప్రభుత్వం మళ్లీ మహారాష్ట్ర పోలీసు చట్టాన్ని సవరించడం ద్వారా డాన్స్ బార్లను నిషేధించింది.దీనిపై ఇండియన్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేవలం వ్యక్తిగత ప్రతీకారం తీర్చుకోడానికే ప్రభుత్వం సుప్రీంకోర్టు తీర్పును కాదని ఈ నిషేధం విధించారని ఆ పిటిషన్లో ఆరోపించారు. కేవలం కొందరు రాజకీయ నాయకులు దీన్ని పరువు సమస్యగా తీసుకుని పెద్దది చేస్తున్నారన్నారు. ఇప్పుడు మళ్లీ సుప్రీంకోర్టు డాన్స్ బార్లపై ఉన్న నిషేధం మీద స్టే విధించడంతో వాటి యజమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం పలు వ్యాఖ్యలు చేసింది. బార్ డాన్సర్ల ఉపాధిని ఎందుకు గౌరవించడం లేదని ప్రభుత్వాన్ని అడిగింది. మహిళలు బార్ లలో డాన్సులు చేస్తే తప్పుగా పరిగణించడాన్ని సర్వోన్నత న్యాయస్థానం తప్పుబట్టింది. అదే బార్ లలో రిసిఫ్టనిస్టుగా, వెయిట్రస్ గా, బార్ టెండర్లుగా మహిళలను వినియోగిస్తున్నప్పుడు లేని అభ్యంతరం మహారాష్ట్ర సర్కారుకు డాన్సర్ల విషయంలోనే ఎందుకు వచ్చిందని నిలదీసింది. ఈ సందర్భంగా ముంబై హై కోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles