12 per cent Muslim quota not yet in Telangana

Kcr cheating muslims

Telangana, Muslim quota, TSPSC, K. Chandrasekhar Rao, Muslims in Telangana, Telangana Reservations

There will be no 12 per cent quota for Muslims in education and employment in Telangana in the near future. Barely two days after Chief Minister K. Chandrasekhar Rao announced in the Legislative Assembly that the Telangana government would implement 12 per cent quota for Muslims in education and employment “very soon”, the government on Friday extended the term of the commission of inquiry studying socio-economic and educational status of Muslims by six more months.

కేసీఆర్ ముస్లింలను మోసం చేస్తున్నారా..?

Posted: 10/10/2015 01:11 PM IST
Kcr cheating muslims

మీరు మైనార్టీలు.. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడ్డారు కాబట్టి మీ అభివృద్దికి కట్టుబడి ఉన్నాం.. మీ అభివృద్ది కోసం తెలంగాణ రాష్ట్రంలో 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తాం అంటూ కేసీఆర్ ఎన్నికలకు ముందు హామీలిచ్చారు. కానీ వాటిని అమలు చెయ్యడంలో మాత్రం వెనకడుగువేస్తున్నారు. తాజాగా కేసీఆర్ ప్రభుత్వం ఎలాంటి అడ్డులు లేకుండా అధికారంలొ కొనసాగుతోంది. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీల గురించి మాత్రం మరిచిపోయారు. ఎన్నికలకు ముందు ఓటు బ్యాంకు రాజకీయాలకు కేసీఆర్ మాత్రం అతీతం కాదు. అందుకే ఎన్నికలకు ముందు కేసీఆర్ మైనార్టీల గురించి బీభత్సమైన ఉపన్యాసాలు చేశారు. తాము అధికారంలోకి వస్తే అసల్లు దిగులుండదు అన్నట్లు మాట్లాడారు. అందుకే ఎంఐఎం పార్టీ కూడా టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంది. కానీ అధికారంలోకి వచ్చాక మాత్రం ఇచ్చిన హామీలను మరిచిపోతున్నారు కేసీఆర్.

తెలంగాణ ముస్లింలు ఎంతో వెనుకబడి ఉన్నారు. ముస్లింల వెనుకబాటుకు చాలా కారణాలున్నాయి. ఆర్థికంగా, సామాజికంగా వారికి అన్ని ప్రభుత్వాలు చేయూతనివ్వాలి. అందులో భాగంగానే వారికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించవచ్చు. రాజ్యాంగం కూడా మైనార్టీల అభివృద్దికి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అవకాశం కల్పించింది. అయితే కేసీఆర్ కూడా ముస్లింలకు తాము అధికారంలోకి వచ్చాక 12శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచింది కానీ కేసీఆర్ మాత్రం ముస్లింలకు కల్పిస్తానన్న 12శాతం రిజర్వేషన్ మీద దాటివేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇస్తానన్న రిజర్వేషన్ల మీద వేసిన కమిటీని మరికొంత కాలం పొడగించారు. మరి ఇదంతా ముస్లింల మీద చిత్తశుద్ది ఉండే చేస్తున్నారా.? మరి కేసీఆర్ కు నిజంగా చిత్తశుద్ది ఉంటే ఇలా ముస్లింలకు ఇస్తానన్న రిజర్వేషన్ల మీద మీనమేషాలు లెక్కిస్తారా..? అన్నది ప్రశ్న.

తెలంగాణలో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి కేసీఆర్ కు సవాలక్ష కారణాలు అడ్డంవస్తున్నాయి. కేసీఆర్ కు గతంలో రిజర్వేషన్ల మీద వేసిన కేసులు అడ్డుగలుతున్నాయట. అయినా రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవా..? అని ఓ నానుడి ఉంది. రాజు తలుచుకుంటే కొండ మీద కోతైనా దిగిరావాల్సిందే.. మరి కేసీఆర్ కు మాత్రం ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం కొరకాని కారణాలు అడ్డం వస్తున్నాయి. అయినా మరోసారి ఎలక్షన్ లు ఉంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా కేసీఆర్ కు ముస్లింలు గుర్తుకు వస్తారు.. వారికి ఇచ్చిన 12శాతం రిజర్వేషన్ల హామీ కూడా గుర్తుకు వస్తుంది. తాజాగా ముస్లింల స్థితిగతులను అధ్యయనం చెయ్యడానికి వేసిన సుధీర్ కమిటి కాలాన్ని మరో ఆరు నెలలకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాగా ప్రస్తుతం తెలంగాణలో వైయస్ రాజశేఖర్ రెడ్డి గతంలో కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరి 12శాతం రిజర్వేషన్లు ఎన్నటికి అమలువుతాయో చూడాలి.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles