mother save her child from death

Mother save her child while her death

Mother, save children, Bhuwaneshwari, Kid save from death, child escape, mother risk

mother save her child while her death. In AP, chittur dist, A mother saved her child, while she facing death. In vedurukuppam mandal, Bhuvaneshwari saved her child from death.

రియల్ బాహుబలి శివగామి... బిడ్డను కాపాడింది

Posted: 10/10/2015 10:26 AM IST
Mother save her child while her death

అమ్మతనానికి ఎవరూ వెల కట్టలేరు. ప్రపంచంలో అమ్మ ప్రేమను ఖరీదు చేసే వస్తువు లేదు. ప్రపంచంలో విలువ కట్టలేని వస్తువుల్లో ఖచ్ితంగా అమ్మ ప్రేమ ముందుంటుంది. తాజాగా బాహుబలి సినిమాలో రమ్యకృష్ణలాగా తన బిడ్డను కాపాడి రియల్ శివగామిగా నిలిచిందో తల్లి. బాహుబలి సినిమాలో శివగామి బాహుబలి కొడుకును కాపాడేందుకు తాను మునిగిపోతూ కూడా ఆ బిడ్డను కాపాడుతుంది. అది సినిమాలో జరిగింది. కానీ నిజ జీవితంలో ఓ తల్లి అచ్చంగా ఇలాంటి పరిస్థితినే ఎదురుకొని చావుకు తలవంచినా.. చివరకు బిడ్డను మాత్రం బ్రతికించుకుంది.

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలంలోని దిగువకన్ని కాపురానికి చెందిన భువనేశ్వరి, రామకృష్ణ దంపతులకు.. రెండేళ్ల కరుణాకర్‌ అనే కుమారుడున్నాడు. భువనేశ్వరి గ్రామంలోనే ఉంటూ.. ఆవులు మేపుతుండేది. బిడ్డను ఎత్తుకుని ఆవులతో స్థానిక అడవిలోకి వెళ్లింది. అడవి సరిహద్దుల్లో అటవీ అధికారులు కందకం తవ్వారు. రెండ్రోజులుగా కురిసిన వర్షాలకు దీంట్లోకి నీరు చేరింది. లోతు ఎంతుంటుదో తెలియక భువనేశ్వరి కాలువలో దిగింది. లోతు ఎక్కువగా ఉండటంతో.. తను మునిగిపోసాగింది. వెంటనే అప్రమత్తమై చంకలోని రెండేళ్ల బిడ్డను గట్టుపైకి విసిరేసింది. అయితే ఆమెను కాపాడేందుకు సమీపంలో ఎవరూ లేకపోవటంతో.. ప్రాణాలు విడిచింది. ఇలాంటి తల్లికు సలాం చేస్తున్నాం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mother  save children  Bhuwaneshwari  Kid save from death  child escape  mother risk  

Other Articles