Attack on buses

Some buses mirrors broken in the bandh

Telangana, Bandh, Buses, Attack on buses, Buses Bandh, Bandh effect

Some buses mirrors broken in the Bandh. Telangana bandh going violent. In Abids and Musheerabad, protesters attacked on buses and broke the mirrors. Police arrested the protesters.

బంద్ లొ బస్సు అద్దాలు ధ్వంసం

Posted: 10/10/2015 09:50 AM IST
Some buses mirrors broken in the bandh

తెలంగాణలో విపక్షాలు కలిసి నిర్వహిస్తున్న బంద్ లో ఉద్రిక్తత చోటుచేసుకుంది. హైదరాబాద్ లో పలుచోట్ల విపక్షాల నాయకులు, మద్దతుదారులు బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. హైదరాబాద్ లోని అబిడ్స్ నుండి పఠాన్ చెరువు వెళుతున్న బస్సు మీద ఆందోళనకారులు దాడికి దిగారు. దాంతో బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి. కాగా ఆందోళన కారులు దాడికి దిగిన సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండగా. వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకుని, అరెస్ట్ చేశారు. తెలంగాణ వ్యాప్తంగా సాగుతున్న బంద్ లో అక్కడక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అబిడ్స్ తో పాటు ముషీరాబాద్ లో కూడా బస్సు అద్దాలు ధ్వంసమయ్యాయి.

తెలంగాణ వ్యాప్తంగా విపక్షాలు నిర్వహిస్తున్న బంద్ జిల్లాల్లో కట్టుదిట్టంగా సాగుతోంది. మహబూబ్ నగర్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్, వరంగల్ లొ చాలా డిపోల్లో బస్సులు బయటకు రాకుండా విపక్షాల నాయకులు అడ్డుకున్నారు. హైదరాబాద్ లో అక్కడక్కడ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఎంజీబీఎస్ లో బస్సులను అడ్డుకునేందుకు విపక్షాల నాయకులు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బస్సు డిపో ముందు బైఠాయించిన విపక్షాల నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అయితే పోలీసులు, విపక్షాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Bandh  Buses  Attack on buses  Buses Bandh  Bandh effect  

Other Articles