Writer Nayantara Sahgal Nehru Niece returns her Sahitya Akademi Award | Modi Government Failures

Writer nayantara sahgal nehru niece returns her sahitya akademi award because of modi

Nayantara Sahgal news, Nayantara Sahgal controversy, Nayantara Sahgal sahitya academy award, Nayantara Sahgal updates, Nayantara Sahgal sensational comments, Nayantara Sahgal comments modi, narendra modi government, nda updates

Writer Nayantara Sahgal Nehru Niece returns her Sahitya Akademi Award Because Of Modi : Writer Nayantara Sahgal has returned the prestigious Sahitya Akademi Award, recording her protest against what she calls a "vicious assault" on India's diversity and debate, and the government's failure to safeguard it.

మోదీపై ధ్వజమెత్తిన నెహ్రూ మేనకోడలు..

Posted: 10/06/2015 06:53 PM IST
Writer nayantara sahgal nehru niece returns her sahitya akademi award because of modi

నరేంద్రమోదీ ప్రధానిగా ఎన్నికైన తొలినాళ్లలో ఆయన హవా బాగానే కొనసాగింది కానీ.. ఆ తర్వాత విమర్శలు తీవ్రస్థాయిలో వెల్లువెత్తడం మొదలయ్యాయి. ఇప్పటికే విపక్ష పార్టీలు తమకు సాధ్యమైనంతవరకు మోదీ మీద విమర్శల వర్షం కురిపిస్తుండగా.. నిన్నటిదాకా జేజేలు కొట్టిన ప్రజలు, మరికొందరు ప్రముఖులు ఆయనపై మండిపాటు వ్యక్తం చేస్తున్నారు. అంతెందుకు.. నిన్నటికి నిన్నే బీజేపీ కురువృద్ధుల్లో ఒకరైన రాంజెఠ్మలానీయే సోషల్ మాధ్యమం వేదికగా మోదీ ఓటమిని చూడాలని వుందని తన అభిప్రాయాన్ని వెల్లడించి మరో సంచలనానికి దారితీసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మేనకోడలు, ప్రముఖ రచయిత్రి నయనతార సెహగల్ మోదీపై ధ్వజమెత్తుతూ.. ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. సాహిత్యరంగంలో జాతీయ పురస్కారమైన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి కేంద్రానికే పంపుతున్నట్లు మంగళవారం వెల్లడించారు.

నరేంద్ర మోదీ ప్రధానిగా ఎన్నికయినప్పటినుంచి దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడిపోయిందని, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచే ప్రక్రియ వేగవంతమైందని సెహగల్ విమర్శించారు. అందుకే ఎన్డీఏ తీరుకు నిరసనగా 1986లో లభించిన కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును వెనక్కిస్తున్నట్లు ప్రకటించారు. గతంలోనూ పలుమార్లు మోదీపై విమర్శలు చేసిన నయనతార.. ఈసారి తన అవార్డును వెనక్కి ఇవ్వడంతో అది సాహితీలోకంతోపాటు రాజకీయ రంగంలోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమె తీసుకున్న నిర్ణయం ఎన్ని వివాదాలకు తావిస్తుందోనని రాజకీయవర్గాల్లో చర్చించుకుంటున్నారు. ఇదిలావుండగా... నెహ్రూ సోదరి విజయలక్ష్మి పండిట్ కు రెండో సంతానంగా 1927లో జన్మించిన నయనతార.. దేశంలో పేరెన్నికగల ఆంగ్ల రచయితల్లో ఒకరిగా ఎదిగారు. రాజకీయ మార్పులతో దేశంలో సంభవిస్తోన్న మార్పులను ఆధారంచేసుకుని ఆమె రచించిన పలు పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. ఆమె రాసిన 'రిచ్ లైక్ అజ్' నవలకు 1986లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nayantara Sahgal  Narendra Modi Government  Sahitya Academy Award  

Other Articles