Ghost in a school

Ghost in a school

School, Ghost, Vishakapatnam, Paderu

Ghost in a school. In Vishaka dist paderu mandal, a ghost news fearing the students. Students are fearing about the ghost in their school.

స్కూల్లో దయ్యం.. నిజం నిజం

Posted: 10/03/2015 11:21 AM IST
Ghost in a school

దెయ్యమంటే భయపడని వారెవరుంటారు. చిన్న పిల్లల దగ్గరి నుండి పెద్దల వరకు అందరూ దెయ్యానికి భయపడేవాళ్లే. అయితే దయ్యానికి ఓ స్కూల్ స్కూలే మూతపడింది. అక్కడి విద్యార్థులు స్కూల్ కు వెళ్లాలంటే భయపడిచస్తున్నారు. అసలు స్కూల్ లేకుంటే పర్లేదు కానీ వెళ్లము గాక వెళ్లము అంటూ మారాం చేస్తున్నారు. పిల్లలు దడుచుకుంటుంటే పెద్దలు మాత్రం ఏం చేస్తారు చెప్పండి. పిల్లలను స్కూల్ కు పంపించకుండా ఇంట్లోనే ఉంచుకుంటున్నారు. అసలు ఆ స్కూల్ కు ఎందుకు వెళ్లడం లేదో తెలుసా..? అక్కడి నుండి ఎవరైనా స్కూల్ కు వెళ్లాలని అనుకుంటే మాత్రం వెంటనే పిల్లల మీదకు రాళ్లు వచ్చి పడుతున్నాయట. అసలే చిన్న చిన్న విషయాలకు భయపడే చిన్న పిల్లలు ఇలాంటి వాటికి మరింత భయపడరు. ఇంతకీ ఇదంతా ఎక్కడ జరిగిందా అనుకుంటున్నారా...?

విశాఖ జిల్లాలోని పాడేరు మండలం ఓబర్తిలో దెయ్యం ఉందనే భయంతో ఓ బడికి తాళం పడింది. కొన్ని రోజుల క్రితం ఆ గ్రామానికి చెందిన భీములమ్మ అనే వృద్ధురాలు మృతి చెందింది. ఆమెను అక్కడ దగ్గర్లో ఉన్న శ్మశానంలో పూడ్చిపెట్టారు. స్కూలుకు వెళ్లాలంటే ఆ దారి గుండానే వెళ్లాలి. దీంతో దెయ్యంగా మారిన భీములమ్మ తమను భయపెడుతోందంటూ విద్యార్థులు వాపోయారు. అటుగా వెళ్లిన వారిపై రాళ్లు రువ్వుతోందని చెబుతున్నారు. దెయ్యంగా మారిన భీములమ్మ ఓ ఇంట్లో ఉందంటూ గ్రామస్తులు ఆ ఇంటిని సైతం తగులబెట్టారు. అప్పటి నుంచి మరింతగా భయపెడుతోందని గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో పిల్లలకు ఎంత నచ్చజెప్పినా బడికి వెళ్లడం లేదంటున్నారు. టీచర్లు వచ్చినా ఎంత నచ్చజెప్పినా విద్యార్థులు మాత్రం స్కూల్ వైపు కన్నెత్తైనా చూడటం లేదు. మరి వారి భయం పోయెదెప్పుడో? బడికి వెళ్లేదెప్పుడో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : School  Ghost  Vishakapatnam  Paderu  

Other Articles